మంగళవారం, జులై 22, 2014

సురమోదము...

ఆదిత్య 369 లోని మరో మంచి పాట ఇది ఇళయరాజా గారి స్వరసారధ్యంలో వేటూరి గారి రచన... ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి, సునంద

తా..తకతాం..తకితాం..తక తకిట దిత్తై..
తకిటతై తత్ తరికిటతాం..
తకతకిట తకతధిమి తకఝుణుతక 
తకిట తద్దిమిత.. ధిమిత తక తకిట..
 
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
స్వరరాగ సంగమ సాధక జీవన
సురగంగ పొంగిన నర్తనశాలల
పదములు చేరగ భంగిమలూదే
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...

ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో ఆఆఆఆఅ...ఓఓఓఓ.. 
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో దాచెనులే కడలి
ఆ... నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి 

 రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో
నాకు వచ్చు నడకల గణితం - నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవవిధ గమకం - నాకు  ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్తగీతముల
ఉత్తమోత్తమము వృత్తగీతముల 
మహా మహా సభాసదులు మురిసిన...
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ  వశమా...

స్పందించే వసంతాల తకఝణు హంపీ శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కళలివి నానా చిత్ర వర్ణాంకమై
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ 

వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ
మ మ గ గ మ ద మ - మ మ ద స ని ద మ
 

రంపంప రంపపంప
రంపంప రంపపంప రంపంప రంపపంప 
భరతము నెరుగని - నరుడట రసికుడు
rock-u  roll-u ఆట చూడు - బ్రేకు లోని సోకు చూడు
west side-u rhyme మీద twist చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
rock rock rock n roll  shake shake shake n roll  

 rock rock rock n roll  shake shake shake n roll  
 రప్ప పా ప - ప పా ప - ప పా ప
ర పా ప పా ప పా ప పా ప పా ప పా ప పా ప
 
తగుదు తగుదు తగుదు తగుదు తగుదు ....  త త

జనగీతము శివ పాద జాతము వచియింపగ  వశమా...

2 comments:

ఈ పాట యెండ్ లో సడన్ గా వెస్ట్రనైజ్ బీట్ లోకి మారిపోతుంది..మేం థియేటర్ లో ఈ మూవీ చూసేటపుడు అంత అనెక్స్పెక్టెడ్ చేంజ్ ఓవర్..ఆ పిక్చరైజేషన్ లో యెంతగా ఇన్వాల్వ్ ఐపోయామంటే..ఆటోమెటిక్ గా అందరూ క్లాప్స్, ఫుట్ టాపింగ్ థియేటర్లో అందరూ ఊగిపోయాం..

హహహ అప్పట్లో ఒక ఊపు ఊపేసిన సినిమా కదండీ ఇదీ నాకూ చాలా ఇష్టమైన సినిమా.. ఈ పాటలు కూడా మా హాస్టల్ మెస్ లో ప్రతి ఆదివారం తప్పక వినిపించేవాడు చాలా రోజులపాటు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail