ఆదివారం, జనవరి 31, 2016

ఇదేలే తరతరాల చరితం...

పెద్దరికం చిత్రంకోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : ఏసుదాస్, స్వర్ణలత

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా 
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
 
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారినే
ఎరగా చేసినదా ద్వేషమూ
కధ మారదా.. ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువుని కుమ్మితే
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువుని కుమ్మితే
అభమూ శుభమూ ఎరుగని
వలపులు ఓడిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం !

విరిసీ విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా .. ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల
పువ్వులు కాలిపోయేనా !

ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం !


శనివారం, జనవరి 30, 2016

ఏ నావదే తీరమో...

ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సంకీర్తన చిత్రం కోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఏసుదాస్

ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ....
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో..ఓ..ఓ.. కథగానో.. ఓ.. ఓ..
మిగిలేది నీవే.. ఈ జన్మలో.. ఓ..

ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో

నాలోని నీవే నేనైనానో 
నీలోని నేనే నీవైనావో
నాలోని నీవే నేనైనానో 
నీలోని నేనే నీవైనావో
విన్నావా ఈ వింతను.. అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను.. అన్నారా ఎవరైనను
నీకూ నాకే చెల్లిందను.. ఉ.. ఉ..

ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో

ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు 
నీ నీలి రంగై నేనున్నాను
కలిసేది ఊహేనను.. ఊహల్లో కలిసామను..
కలిసేది ఊహేనను.. ఊహల్లో కలిసామను..
నీవూ.. నేనే.. సాక్షాలను..

ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
కలగానో..ఓ.. కథగానో.. ఓ..
మిగిలేది నీవే ఈ జన్మలో..
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో.. ఏ నేస్తమే జన్మవరమో

శుక్రవారం, జనవరి 29, 2016

మా పాపాల తొలగించు...

ఇళయరాజా గారి స్వరకల్పన లో ఏసుదాస్ గారు గానం చేసిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఏసుదాస్ 

మా పాపాల తొలగించు దీపాల
నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య

మా పాపాల తొలగించు దీపాల
నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య

పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను
పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం 
చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా
పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలుపుల్ని తీసేస్తివి, 
మా కలతలని మాపేస్తివి

మా పాపాల తొలగించు దీపాల
నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి
మరుజన్మ ఇచ్చావయ్య
వారి బాధల్ని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో 
నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే
ధన్యులమయినామయ్య
మాకు దైవమై వెలిసావయ్య

మా పాపాల తొలగించు దీపాల
నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య




గురువారం, జనవరి 28, 2016

సుక్కల్లే తోచావే...

నిరీక్షణ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నిరీక్షణ (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఏసుదాస్

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో..
కాగిందే నా పేదగుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై..ఈ..
ఉన్నానే ఈ నాటికి నేస్తాన్నై..ఐ..
ఉన్నా ఉన్నాదొక దూరం
ఎన్నాళ్లకు చేరం.. తీరందీనేరం..

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

తానాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే..ఏ..
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే..ఏ
ఉందా కనీళ్ళకు అర్థం
ఇన్నేళ్ళుగా వ్యర్థం.. చట్టందే రాజ్యం..

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏలసుక్కల్లో నిన్ను నే నెతికానే

సుక్కల్లే తోచావే
ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే

బుధవారం, జనవరి 27, 2016

తెలవారదేమో స్వామీ...

శృతిలయలు చిత్రంలోని ఈ పాట అన్నమాచార్య కీర్తనేనేమో అనిపించేలా వ్రాయడం సిరివెన్నెల గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఏసుదాస్, సుశీల

తెలవారదేమో స్వామీ..
తలపుల మునుకలో..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..

తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..
తెలవారదేమో స్వామీ..

తెలవారదేమో స్వామీ..
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. ఉ.. ఉ.. ఊ..
తెలవారదేమో స్వామీ..

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలఅలజడికి నిద్దుర కరవై..
కలలఅలజడికి నిద్దుర కరవై

అలసిన దేవేరి అలసిన దేవేరి
అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా..

అలసిన దేవేరి అలమేలు మంగకూ ఊఊ...
తెలవారదేమో స్వామీ
గామపని... తెలవారదేమో...
సా ని ద ప మ ప మ గ ని స గా మ
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ..

మంగళవారం, జనవరి 26, 2016

అందమైన వెన్నెలలోన...

అసెంబ్లీ రౌడీ చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అసెంబ్లీ రౌడీ (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : రసరాజు
గానం : ఏసుదాస్, చిత్ర

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
మనసు నిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలే ఊగాల శివరంజనవ్వాల
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరార మగసిరిలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరార మగసిరిలా
 
నురుగు తరగల గోదారై వలపు మిల మిల మెరవాలా
ఒంపుసొంపుల సెలఏరై వయసు గల గల నవ్వాలా 
నురుగు తరగల గోదారి వలపు మిల మిల మెరవాలా
ఒంపుసొంపుల సెలఏరై వయసు గల గల నవ్వాలా
కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాలా
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా 
కంటి పాపనై కాలి అందెనై
కంటి పాపనై కాలి అందెనై
కాలమంతా కరగబోసి కాపు ఉండనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలె 
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా

ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా 
సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా
ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా 
సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా
ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
తోడూ నీడ ఇరువురమై గూటికందం తేవాలా
తీగమల్లెనై తేనేజల్లునై
తీగమల్లెనై తేనేజల్లునై
కోరికంత కూడబెట్టి కొలువు సేయనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస

 
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచిరావే సరిగమలా
కనుల నిండా కలలు పండా పూలపడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

 

సోమవారం, జనవరి 25, 2016

కదిలే కాలమా...

పెదరాయుడు చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెదరాయుడు (1995)
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీ హర్ష
గానం : ఏసుదాస్, చిత్

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమ దేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ

లాలించే తల్లి.. పాలించే తండ్రి..
నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ.. నీకంటి చెమ్మ..
నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే.. ఏ ఏ..
నీ కడుపులో పసివాడినే
ఏ నాడు తోడుని నీడను వీడనులే...

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ
పేగే కదలగా
సీమంత మాయెలే ప్రేమ దేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మ

తాతయ్య తేజం.. పెదనాన్న నైజం..
కలిసున్న పసి రూపం
నీ రాణి తనము.. నా రాచ గుణము..
ఒకటైన చిరు దీపం
పెరిగేనులే నా అంశమూ.. ఊ ఊ...
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములతో

ఎన్నో నోములే.. గత మందు నోచి ఉంట
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా
నడిచే దైవమా..
నీ పాద ధూళూలే పసుపు కుంకమలు నాకు

ఎన్నో నోములే గత మందు నోచి ఉంటా
మీకే భార్యనై ప్రతి జన్మ నందువుంటా


 

ఆదివారం, జనవరి 24, 2016

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..

అంతులేని కథ చిత్రం కోసం ఏసుదాస్ గారు గానం చేసిన ఓ మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అంతులేని కథ (1976)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఏసుదాసు

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
 
నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా

ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

 
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కభోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా

ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

 
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా

ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
 
 

శనివారం, జనవరి 23, 2016

నీతోనే ఆగేనా సంగీతం...

రుద్రవీణ చిత్రంలోని ఓ అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ఏసుదాస్ 

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి
నీతోనే ఆగేనా సంగీతం
 బిళహరీ అని పిలువకుంటే
స్వరవిలాసం మార్చుకుంటే
ఆరిపోదు గానజ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
యుగయుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

నీతోనే ఆగేనా సంగీతం 
  
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది
ఏ జ్ఞానం ఆ నాదం
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
అహంకరించి సాగుతున్న వేళలో
ఎడారిపాలు కాదా గానవాహిని
వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా

నీతోనే ఆగేనా సంగీతం 

మగపద నీ..తోనే 
సరీగ రిగాప గపాద నీ...తోనే
సరిగ రిగప మగపద మగ రిగప
గపద మగపదదరి నీ...తోనే
పాదమ గపద రిస రీగరి సనిదప ద 

దాసరిగ పాగసరి గాపదస రీగసరి  సరిగపదరి నీతోనే
సరిగ పమగ  రిగపమగరి సాస సాస రీరి రీరి
సని ద సని ద పమ గ పమ గ
రిగమప గరి సనిదప ద రిగరి సనిదప
మగపద గసనిదప దని సనిద
సరిగపద రిగపద దరి
నీతోనే ఆగేనా సంగీతం
బిలహరి అని పిలవకుంటే 
స్వర విలాసం మార్చుకుంటే
ఆరిపోదు గాన జ్యోతి

నీతోనే ఆగేనా సంగీతం
 
   

శుక్రవారం, జనవరి 22, 2016

సృష్టికర్త ఒక బ్రహ్మ...

అమ్మ రాజీనామా చిత్రంలో ఏసుదాస్ గారు గానం చేసిన ఓ అమ్మపాటను ఈ రోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది ఆడియో జ్యూక్ బాక్స్, ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పాట వీడియో ఇక్కడ చూడచ్చు లేదా ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమ్మ రాజీనామా (1991)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి నారాయణ రావు
గానం : ఏసుదాస్

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆ అమ్మకే.. తెలియని.. చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

బొట్టు పెట్టి పూజ చేసి.. గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే.. గోవు తల్లే కోత కోత
బొట్టు పెట్టి పూజ చేసి  గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత

విత్తు నాటి చెట్టు పెంచితే
చెట్టు పెరిగి పళ్ళు పంచితే
తిన్న తీపి మరిచిపోయి
చెట్టు కొట్టి కట్టెలమ్మితే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆకు చాటు పిందె ముద్దు.. తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే.. కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు

ఉగ్గు పోసి ఊసు నేర్పితే
చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే
చేయి మార్చి చిందులేస్తే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

గురువారం, జనవరి 21, 2016

స్వరరాగ గంగా ప్రవాహమే...

సరిగమలు చిత్రం నుండి ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బోంబే రవి
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్

ప్రవాహమే గంగా ప్రవాహమే ....

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ

కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు 
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే    

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

 

బుధవారం, జనవరి 20, 2016

కొండలలో నెలకొన్న...

అల్లుడుగారు చిత్రంలోని ఓ చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటలో అన్నమాచార్య కీర్తనకు సాటిరాగల మరో చక్కని చరణం జోడించన సినీ కవి ఎవరో తెలియదు. టైటిల్ కార్డ్ లో జాలాది, జొన్నవిత్తుల, రసరాజు, గురుచరణ్ గార్ల పేర్లున్నాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అల్లుడుగారు (1990)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : అన్నమయ్య + ??
(జొన్నవిత్తుల/జాలాది/రసరాజు/గురుచరణ్)
గానం : ఏసుదాసు, చిత్ర

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు

కుమ్మరదాసుడైన కురువరత్తినంబి
ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడూ..

కొండలలో నెలకొన్న.. గమ దని సగమా 
గగని దమ గస కొండలలో...
సగ సమ గద మని గమ 
గద మని దస నిదమగ దమగస

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

ఎదలోని శ్రీసతి ఎపుడో ఎడబాటు కాగ
ఎనలేని వేదనలో రగిలినవాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతీ
మమతలకోవెలలో మసలనివాడు
నీతికి నిలిచినవాడు దోషిగ మారెను నేడు
ప్రేమకి ప్రాణంవాడు శిక్షకు పాత్రుడు కాడు
ఆర్తరక్షక శ్రీవెంకటేశ్వర కరుణతో
తోడునీడై వాణ్ణి కాపాడు నేడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

మంగళవారం, జనవరి 19, 2016

అనుజుడై లక్ష్మణుడు...

స్వరాభిషేకం చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఏసుదాస్

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు బిలువ
తపమేమి జేసెనొ ఈ రామయ్య

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు బిలువ
తపమేమి జేసెనో రామయ్య
తపమేమి జేసెనో తెలియా

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు బిలువ
తపమేమి జేసెనో రామయ్య
తపమేమి జేసెనో తెలియా

తనువులో తనువైన తన సతికి దూరమై లక్ష్మణుడు
తనువులో తనువైన తన సతికి దూరమై
చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింపా...ఆఆఆ..
చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింపా
చెంతనే తానుండి చింత తీర్చిన వాని లక్ష్మణుని
తమ్ముడా యని బిలువ
తపమేమి జేసెనో...

ఆ సా సా స ని ద ప మ
గ మ ప మ ప ద ప ద ని స
సా రి గ ప మ గ ప మ ద
ప ని ద ప
రీ ని రి గ
ద ని రి
రి గ మ
గ మ ద
మ ద ని రి
గ ని స
రి స ని
స ని ద
ని ద ప
మ గ రి స గ రి
గా గా గ
రి గ ప మ గ రి
ని రి గ రి
సా సా సా
ని గ రి
ని రి స ని ద ప మ
పా పా ప
ప ద ప మ గ రి ని రి గ రి
గా గా
రి గ
ని ద ప మ గ ప
స ని
స ని ద ప మ గ రి
సా సా సా స సా సా స
రీ రీ రీ రి రీ రీ రి
గ రి
స ని స రి స
ని స రి సా ని
స ని ద ప మ
ప మ గ
రి స ని
గ రి స
మ గ రి
ప ద ని
సా స స
సా స స
స రి గ రి
ని రి గ రి
ని ద ప
పా ప ప
పా ప ప
మ ద ని ద
గ మ ని ద
మ గ రి స ని
గ స స ని
ని రి రి స
స గ గ రి
రి మ గ గ
గ ప ప మ
మ ద ద ప
గ మ మ
మ ద ప
ప ని ద
ద స ని
రి మ గ ప మ ప ద స ని రి గా
గా రీ స
గ రి స
గ రి స రి స ని స ని ద
సా నీ ద ప
స ని ద ప
స ని ద ప
ని ద ప మ
ద ప మ గ రి
రి గ మ ప ద
రి గ మ ప ద
గ మ ప ద ని
మ ప ద ని స
ద ని స గ రి సా

నాన్నా తమ్ముడు..

అగ్రజుడు రాఘవుడు తమ్ముడా యనుచు బిలువ
తపమేమి జేసెనో లక్ష్మణుడు
యీ లక్ష్మణుడు తపమేమి జేసెనో తెలియ
ఆ అగ్రజుడు రాఘవుడు తమ్ముడా యనుచు బిలువ
తపమేమి జేసెనో లక్ష్మణుడు
తపమేమి జేసెనో తెలియ


సోమవారం, జనవరి 18, 2016

లలిత ప్రియ కమలం...

ఈ రోజు రుద్రవీణ చిత్రంలో ఏసుదాస్ గారు అద్భుతంగా గానం చేసిన ఈ మధురమైన పాటను విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఏసుదాస్, చిత్ర

లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది 
కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ...
ఉదయ రవి కిరణం మెరిసినది 
ఊహల జగతిని.. ఆఆఆ..ఆఆఅ..
ఉదయ రవి కిరణం మెరిసినది 
అమృత కలశముగ ప్రతి నిమిషం
అమృత కలశముగ ప్రతి నిమిషం
కలిమికి దొరకని..
చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది
 
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల 
పూల దరహాసముల మనసులు మురిసెను

లలిత ప్రియ కమలం విరిసినది 
కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ...
ఉదయ రవి కిరణం మెరిసినది 
 
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినది
మనసు హిమగిరిగ మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
వ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె
వడివడి పరువిడి

ఉదయ రవి కిరణం మెరిసినది 
ఊహల జగతిని.. ఆఆఆ..ఆఆఅ..
లలిత ప్రియ కమలం విరిసినది 
కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ..
లలిత ప్రియ కమలం విరిసినదీ...

 

ఆదివారం, జనవరి 17, 2016

మహా గణపతిం...

జనవరి పదిన ఏసుదాస్ గారి పుట్టినరోజు సంధర్బంగా ఈ నెలలో మిగిలిన రోజులు ఆయన పాడిన పాటలు తలచుకుందాం. ముందుగా సింధుభైరవి చిత్రం కోసం ఏసుదాస్ గారు గానం చేసిన మహాగణపతిం కీర్తనను విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసినది తమిళ్ వీడియో. తెలుగు జ్యూక్ బాక్స్ ఇక్కడ వినవచ్చు.


చిత్రం : సింధుభైరవి (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ముత్తుస్వామి దీక్షితులు
గానం : ఏసుదాస్

మహాగణపతిం
శ్రీ మహాగణపతిం
శ్రీ మహాగణపతిం మనసా స్మరామి
మహాగణపతిం మనసా స్మరామి
మహాగణపతిం మనసా స్మరామి
మహాగణపతిం మనసా స్మరామి

వశిష్ట వామదేవాది వందిత
మహాగణపతిం మనసా స్మరామి
వశిష్ట వామదేవాది వందిత
మహాగణపతిం

మహాదేవసుతం...ఆఆఆఅ...
మహాదేవసుతం గురుగుహనుతం
మహాదేవసుతం గురుగుహనుతం
మార కోటి ప్రకాశం శాంతం
మార కోటి ప్రకాశం శాంతం
మహాకావ్య నాటకాది ప్రియం
మహాకావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదకప్రియం
మహాకావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదకప్రియం

మహాగణపతిం మనసా స్మరామి
వశిష్ట వామదేవాది వందిత
మహాగణపతిం


 

శనివారం, జనవరి 16, 2016

పదరా పద పద రాముడు...

రథం ముగ్గులు, మినప గారెలు, ముస్తాబైన పశువులు, ఎడ్లపందాలు, ఆటపాటలతో కూడిన కనుమ సంధర్బంగా కుటుంబగౌరవం చిత్రంలో అన్నగారు తన ఎడ్ల గురించి పాడిన ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కుటుంబ గౌరవం (1957)
సంగీతం :విశ్వనాథన్ రామ్మూర్తి
సాహిత్యం : 
గానం : ఘంటసాల

ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలో చలో
ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలో చలో
పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 
పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు

రాముడూ పెద్ద మొనగాడు 
భీముడూ పెద్ద మోతుబరి 
ముట్టిన కొట్టిన సహించరూ
మోరలెత్తి పైకెగబడుతారూ 
కష్టం వేస్తే పెద్ద పులులవే 
ఇష్టం వేస్తే పసిపాపలవే 

పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 

తొలకరి జల్లే చిలకరించినా 
పొంగి నేలయే పులకరించినా 
పరవశమై దూకేస్తారూ
పొలాల చిటెకలో దున్నేస్తారూ
మా రైతులకే సాయంజేసీ 
మహరాజులుగా మార్చేస్తారూ 
ఏమంటావ్ రాముడూ 
ఏమంటావ్ భీముడూ 
ఏమంటావ్ రాముడూ 
ఏమంటావ్ భీముడూ 

అన్నా.. ఓ గోపన్నా.. 
నీకన్నా మాకు తోడు ఎవరున్నారన్నా 
నీవంటే మాకిష్టం నీస్నేహం అదృష్టం 
ఒహొహో ఒహొహో 
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా 
అన్నదమ్ములారా మీరే మాటలు నేర్చారా 
మనసే విప్పి పలికారా మానవులైనారా
మనసే విప్పి పలికారా మానవులైనారా
అమ్మతోటి మీ చల్లని మాటలు చెపుతాలే రండి 
అమ్మతోటి మీ చల్లని మాటలు చెపుతాలే రండి
అందరి చేతా ఘన సన్మానం చేయిస్తాలే రండి 

పదరా పద పద రాముడు 
పరుగు తీయరా భీముడు
పల్లెల మీదా మన సవాల్ 
పందానికీ భలే హుషార్ 


శుక్రవారం, జనవరి 15, 2016

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా...

మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా కోటి స్వరపరచిన ఓ సంక్రాంతి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సోగ్గాడి పెళ్ళాం (1996)
సంగీతం : కోటి
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర, బృందం

కలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది
తుమ్మెద ఓ తుమ్మెద
మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది
తుమ్మెద ఓ తుమ్మెద
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
చలిమంట వెలుగుల్లూ తుమ్మెద ఓ తుమ్మెద

 
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా  
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా.. ఆ... ఆ... పేరంటం 
ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో
పొంగే హేమంత సిరులు..

గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో
గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో

 
మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ
నమ్మే మన పల్లెటూళ్లు
న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ
చెబుతాయి స్వాగతాలు
బీద గొప్పోళ్లనే మాటలేదు 
నీతి నిజాయితీ మాసిపోదు
మచ్చలేని మనసు మాది
మంచి పెంచు మమత మాది
ప్రతి ఇల్లో బొమ్మరిల్లు...

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా 
సరదాలు తెచ్చిందే తుమ్మెదా

పాటే పంచామృతం మనసే బృందావనం
తడితేనే ఒళ్లు ఝల్లు
మాటే మకరందము చూపే సిరి గంధము
చిరునవ్వే స్వాతి జల్లు
జంట తాళాలతో మేజువాణి
జోడు మద్దెళ్లనీ మోగిపోనీ
చెంతకొస్తే పండగాయే
చెప్పలేని బంధమాయే
వయసే అల్లాడిపోయే..

 
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా
సరదాలు తెచ్చిందే తుమ్మెదా  
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా.. ఆ... ఆ... పేరంటం  
ఊరంతా... ఆ... ఆ... ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో
పొంగే హేమంత సిరులు..
 
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.