శనివారం, జనవరి 02, 2016

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..

బొబ్బిలి యుద్దం చిత్రంకోసం భానుమతి గారు గానం చేసిన ఓ మధుర గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల జూనియర్
గానం : పి. భానుమతి

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.. ఆ..ఆ..ఆ
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల
దీవించు మమ్ములా.. ఆ..ఆ
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కన్న తండ్రి కలలు నిండి..
మా కన్న తండ్రీ కలలు నిండి
కలకాలం వర్ధిల్లగా..ఆ..ఆ..ఆ..ఆ

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
సిరులు యశము శోభిల
దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

పెరిగి మా బాబు వీరుడై
ధరణీ సుఖాల ఏలగా
పెరిగి మా బాబు వీరుడై
ధరణీ సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి..
తెలుగు కీర్తి తేజరిల్లి.. 
దిశలా విరాజిల్లగా..ఆ..ఆ..ఆ..

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల
దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.