మహతి స్వరసాగర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మహతి స్వరసాగర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, మార్చి 15, 2021

ఆనందమానందం

ఇష్క్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇష్క్ (2021)
సంగీతం : మహతి స్వరసాగర్    
సాహిత్యం : శ్రీమణి 
గానం : సిధ్ శ్రీరామ్, సత్య యామిని

ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా.. ఓహో.. 
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా... ఓహో..

మెత్తనైన నీ పెదవులపై 
నా పేరే రాశావా
నే పలికే భాషే నువ్వయావే వెన్నెలా
రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా
విడువలేనే నేనిలా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే 
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే 
పొంగే వరదలా

మిలమిల మెరిసే 
కనుచివరలే మిణుకుల్లా
విసరకు నువ్వే 
నీ చూపులే మెరుపుల్లా
మెరిసెనా మెల్లగా
దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా 
రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా 
స్వరాలూ పూసేనా
ప్రేమలో ఓ నిమిషమే 
యుగాలు సాగేనా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే 
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు 
నదికే పొంగే వరదలా
 


శుక్రవారం, ఫిబ్రవరి 05, 2021

వాటే వాటే వాటే బ్యూటీ...

భీష్మ చిత్రం లోని ఓ సరదాగా సాగే ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భీష్మ (2020)
సంగీతం : మహతి స్వర సాగర్    
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : ధనుంజయ్, అమల చెబొలు 

థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..
 
వాటే వాటే వాటే బ్యూటీ
నువ్ యాడా ఉంటే ఆడ్నే ఊటీ

థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..

వాటే వాటే వాటే బ్యూటీ
నువ్ యాడా ఉంటే ఆడ్నే ఊటీ
తిప్పుతుంటే నడుమే నాటీ
నా కండ్లే చేసే కంత్రీ డ్యూటీ
నువ్ దగ్గరికొస్తాంటే సల్లగ సలి పెడతాందే
దూరమెల్లి పోతాంటే మస్తు ఉడక పోస్తాoదే
టైటు హగ్గిచ్చి టాటూలా అంటుకోరాదే.. రా రాదే..

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు.. అరే.. 
అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.. ఏసేయ్.. 
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు
తెరిచుంచవే పోరి ఫ్రంటు డోరు

థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్.. 
థా ధిన్ ధిన్ నక్ ధిన్ ధిన్ 
నక్ ధిన్ ధిన్ న..

సూడకే సిట్టీ మంటలు పుట్టీ
ఫైరింజన్ తిరుగుతాందె గంటలు కొట్టి
రైలింజన్ లా కూతలు పెట్టీ
టైమంతా గడిపేయ్యకు మాటల తోటీ
ఎండల్లో నువ్ తిరగొద్దే 
సూర్యునికే చెమటట్టుద్దే
ఇంతందాన్నే దాచొద్దే 
ఇన్ కమ్ టాక్స్ రైడైపోద్దే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు.. అరే.. 
అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.. ఏసేయ్.. 
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు
తెరిచుంచేయ్ వే పోరి ఫ్రంటు డోరు

నువ్ కూర్సున్నా ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గ అది ఫ్లైటేనా
ఇన్నాళ్ళుగా సింగిల్ గున్నా
నీ ఫోటోకే నేను ఫ్రేమై పోనా
నువ్ కాలు మోపిన చోటే 
ఈ భూమికి బ్యూటీ స్పాటే
ఫారిన్ లో నువ్ పుట్టుంటే 
తెల్లోళ్ళంతా డక్కౌటే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు.. అరే.. 
అమ్మా అయ్యా ఇంట్లో ఎవరూ లేరు.. ఏసేయ్.. 
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు
తెరిచుంచేయ్ వే పోరి ఫ్రంటు డోరు
 


గురువారం, జనవరి 30, 2020

సింగిలే.. రెడీ టు మింగిలే..

భీష్మ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భీష్మ (2020)
సంగీతం : మహతీ స్వరసాగర్ 
సాహిత్యం : శ్రీమణి 
గానం : అనురాగ్ కులకర్ణి 

హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్ లే
వందల్లో ఉన్నారులే ఒక్కళ్లు సెట్ అవ్వలే 
కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం వెయిటింగ్‌లే
పాపెనకే జాగింగ్‌లే లైఫంతా బెగ్గింగులే  
 
ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా
బాయ్​ ఫ్రెండ్​లా మార్చదే నను ఏ పిల్లా
ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారలా 
నా వైపిలా చూడదు ఏ సిండ్రెల్లా

ఓయ్ సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా పాప
ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే
ఒళ్ళంత జెలసీ మంటలే చల్లార్చేయ్ పాప

ఓ ప్రెట్టీ ప్రెట్టీ గర్ల్ ఓ నాననాన
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ

ఓ ప్రెట్టీ ప్రెట్టీ గర్ల్ ఓ నాననాన
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ

ఎందుకో ఏమో వొంటరై ఉన్నాను ఇలా
ఏదురు పడదేమో అందాల దేవత
జాలి చూపేనా కాలమే నాపై ఇలా
ఏమీ తలరాతో నా కర్మ కాలిందిలా
అయ్యాయ్యో...

ఓయ్ సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా పాప
ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే
ఒళ్ళంత జెలసీ మంటలే చల్లార్చేయ్ పాప



శనివారం, ఆగస్టు 11, 2018

ఎగిరెనే మనసు సీతాకోకలాగా...

@నర్తనశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : @నర్తనశాల (2018)
సంగీతం : మహతి స్వర సాగర్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : మహతి స్వరసాగర్, సమీర భరధ్వాజ్

హా ఎగిరెనే మనసు సీతాకోకలాగా
ఎగిరెనే ఎపుడు లేదిలాగా
నువ్విచ్చిన రెక్కల వల్లేగా
చుక్కల్లో విహరిస్తున్నాగా..

మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా
మెరిసెనే మైమరచిపోయేలాగా    
నువ్వద్దిన రంగుల వల్లేగా
సరికొత్తగ కనిపిస్తున్నాగా

తొలిసారి పెదవి గమ్మంలో
చిరునవ్వే అడుగుపెట్టింది
కడదాకా ఉండిపోతే బాగుండనిపిస్తోంది

తొలిసారి గుండెసడి లోకి
అలలాంటి అల్లరొచ్చింది
ప్రతిసారి కావాలంటూ అడగాలనిపిస్తుంది

 
ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే

  ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే

  
చల్లగా చిరుగాలై చుట్టేశావుగా హో..
మెల మెల్లగా సెగలోకీ నెట్టేశావుగా హో..
నాలో నే నవ్వేస్తున్నా నాకై నే వెతికేస్తున్నా
నీలాగే కనిపిస్తున్నా హయ్యాయ్యో నీవల్లే
నా మనసే నన్నేనాడూ ఏదీ అడిగిందే లేదు
తొలిసారి కావాలందీ నిన్నేలే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే 


సోమవారం, మే 28, 2018

చూసీ చూడంగానే...

ఛలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛలో (2018)
సంగీతం : మహతి స్వర సాగర్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : అనురాగ్ కులకర్ణి, సాగర్

చూసి చూడంగానే  నచ్చేసావే
అడిగి అడగకుండా వచ్చేసావే
నా మనసులోకి .. హో..
అందంగా దూకి


దూరం దూరంగుంటూ ఎం చేసావే
దారం కట్టి గుండె ఎగరేసావే

ఓ చూపుతోటి హో..
ఓ నవ్వుతోటి..

తొలిసారిగా...
నా లోపల...
ఏమయ్యిందో...
తెలిసేదెలా..

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనే చూసానులే ..

నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను 
చూస్తున్నట్టే ఉందిలే..
హో...
 
నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
ఆహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంటపడకుండా 
నా వెంట పడకుండా
ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నే చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తునానులే
ఒకటో ఎక్కం కూడా
మరిచిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావే ...
నిను చూడకుండా ఉండగలనా

నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోనూ చూసానులే ..
నీ వంక చూస్తుంటే
అద్దంలో నను నేను 
చూస్తున్నట్టే ఉందిలే
హో...

సోమవారం, మే 21, 2018

అమ్మాయే చల్లో అంటు...

ఛలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛలో (2017)
సంగీతం : మహతి స్వరసాగర్
సాహిత్యం : కృష్ణ మదినేని
గానం : యాసిన్ నిజార్, లిప్సిక

అమ్మాయే చల్లో అంటు నాతో వచ్చేసిందిలా
లైఫంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా
పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా
నీకోసం మళ్ళీ పుట్టే పిచ్చుందీ నీ పైనా

ఐలవ్యూ లవ్యూ అంటూ నా గుండె కొట్టుకుందే
నా హనీ హనీ అంటూ నీ పేరే పలికిందే 
 
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

చలో చలో అనీ నీతోనె వస్తూ ఉన్నా
ఏమైపొయినా పదా
పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా
ఇదే నిజం కదా
ఓ మేరి లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో
మారెనే నన్నే మార్చెనే
ఏ పెహలి నజర్ నువ్వంటె నన్నే మించే
ఇష్టం నాదిలే దునియా నీదిలే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటె మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది
మదే నన్నే తట్టీ
ముడే పడె కదా ఏ నాడో అంటూ ఉంది
గుడే గంటే కొట్టి
ఓ మేరి జానా నీ నవ్వె నన్నే
పట్టి గుంజెలేసనే ప్రాణం లాగనే
ఓ తూహి మేరా గుండెల్లో నిన్నే ఉంచా
నేనె లేనులే నువ్వె నేనులే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటె మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలెస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.