సోమవారం, మార్చి 15, 2021

ఆనందమానందం

ఇష్క్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇష్క్ (2021)
సంగీతం : మహతి స్వరసాగర్    
సాహిత్యం : శ్రీమణి 
గానం : సిధ్ శ్రీరామ్, సత్య యామిని

ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా.. ఓహో.. 
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా... ఓహో..

మెత్తనైన నీ పెదవులపై 
నా పేరే రాశావా
నే పలికే భాషే నువ్వయావే వెన్నెలా
రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా
విడువలేనే నేనిలా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే 
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే 
పొంగే వరదలా

మిలమిల మెరిసే 
కనుచివరలే మిణుకుల్లా
విసరకు నువ్వే 
నీ చూపులే మెరుపుల్లా
మెరిసెనా మెల్లగా
దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా 
రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా 
స్వరాలూ పూసేనా
ప్రేమలో ఓ నిమిషమే 
యుగాలు సాగేనా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే 
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు 
నదికే పొంగే వరదలా
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.