తెల్లవారితే గురువారం సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తెల్లవారితే గురువారం (2021)
సంగీతం : కాలభైరవ
సాహిత్యం : రఘురామ్
గానం : కాలభైరవ, సాహితి చాగంటి
మెల్లగా మెల్లగా దారులే మారెనా
కొత్తగా కొత్తగా పయనమే చూపెనా
నిన్నటి ఆశే మాని రేపటి ఊసే లేని
ఆ క్షణమే ఎదురైందా రమ్మని పిలిచిందా
చీకటి నీడను దాటి వేకువ వాకిలిలోకి
ఊహలతో ఎగిరిందా ఇంతలో మనసిలా
అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా
కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే
శ్వాసై మారేట్టుగా
ఓఓ..!
అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా
కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే
శ్వాసై మారేట్టుగా
మెల్లగా మెల్లగా దారులే మారెనా
కొత్తగా కొత్తగా పయనమే చూపెనా
ఓ ఓ ఓఓ ఓ
ఎలా గతమొక క్షణములొ మాయం
జతై ముడిపడమన్నది ప్రాణం
కథే మలుపులు చూపిన వైనం
ఒకే అలుపెరగని ఆరాటం
ఎలా మనసుతో ముందడుగేయడం
మెల్లగా మెల్లగా దారులే మారెనా
కొత్తగా కొత్తగా పయనమే చూపెనా
అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా
కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే
శ్వాసై మారేట్టుగా
ఓఓ..! అరెరే ఉన్నట్టుండి చల్లని గాలై చేరిందే
ఏదో స్నేహం ఇలా
కంగారే తగ్గించి కాలక్షేపం చేసిందే
శ్వాసై మారేట్టుగా
ఆ గతమొక క్షణములో మాయం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.