బుధవారం, మార్చి 03, 2021

నీ మాయలో పడితే/నీ నవ్వు చాలంటా...

ఇటీవల జీ ఫై లో విడుదలైన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ "నిన్నిలా నిన్నిలా" సినిమాలోని ఓ చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నిన్నిలా నిన్నిలా (2021)
సంగీతం : రాజేష్ మురుగేశన్  
సాహిత్యం : శ్రీమణి  
గానం : విజయ్ ఏసుదాస్, రాజేష్ మురుగేశన్

నీ నవ్వు చాలంటా 
నా కంటనీరు మాయం
నీ చూపు చాలంటా 
ఈ చీకటే మాయం
మాటలెన్నున్నా 
నచ్చే మౌనమే నువ్వూ
పాటలా నిన్నూ 
పలికే పెదవినే నేనూ

నీ నవ్వు చాలంటా 
నా కంటనీరు మాయం
నీ నవ్వు చాలంటా 
నీ నవ్వు చాలంటా 

తియ్యనీ నీ పిలుపులో 
నా అడుగుకెన్ని పరుగులో 
నువ్వు తాకి చూసే వేళలో
ఒక రంగుకెన్నీ రంగులో
క్షణముకెన్ని ఊహలో 
నీ ఊసులే విను మనసులో
ఈ కలలకెన్నీ కులుకులో
నా నిదురకెన్ని ఉలుకులో

నీ నవ్వు చాలంటా 
నా కంటనీరు మాయం
నీ నవ్వు చాలంటా 
నీ నవ్వు చాలంటా 

ఆఆ... అలసిపోయే వేళలో 
నువ్వు కలిసి ఉంటే చాలులే 
ఇక మాయమవదా అలసటే 
మటు మాయమవదా నిలకడే
ఊహలంటే తెలియదే 
నీ ఊసులే విను మనసుకే 
ఈ కలలు అంటే తెలియదే 
నా నిదుర నిండా నీ కథే 

మాయమవదా లోకమంతా
మెరిసిపోదా మనసిలా 
నీ మాయలో పడితే 
నీ మాయలో పడితే 

మారిపోదా కాలమంతా 
మరపు రానీ గురుతులా
నీ మాయలో పడితే 
నీ మాయలో పడితే 


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.