చావుకబురు చల్లగా సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : చావు కబురు చల్లగా (2021)
సంగీతం : జేక్స్ బిజోయ్
సాహిత్యం : కౌశిక్ పెగళ్ళపాటి, సనరె
గానం : గౌతమ్ భరధ్వాజ్, షాషా తిరుపతి
పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ
నా ప్రాణం చెప్పిందే
నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
మా పగపమగరిగరి పా గరిరిగరి
నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
సరిగపనిసరి సా గపగరిసనిప
కదిలే కాలాన్నడిగా
ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా
నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా ఆఆ
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీ దాకా ఆఆ
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా
ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా
నీ వైపే నను లాగమని
రిగ రిగ రిగ రిగ రిరి పని
రిగ రిగ రిగ రిగ పప
పస పస పస పనిదస ని
రిగరిని ప నిగరి
గనిపగరిరి గనిపగరిరి
ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసావెలా
మనసావాచా మనసిచ్చాగా
నీ తలరాతే మార్చేస్తా నా చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా
ఏ దూరాలు రాలేవడ్డంగా
నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా
నీ లోపలి హృదయాన్నై
నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా
విడిపోని ప్రణయాన్నై
నీడల్లే తోడుంటా
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా
ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా
నీ వైపే నను లాగమని
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.