ఆదివారం, మార్చి 07, 2021

ఇంకోసారి ఇంకోసారి...

టక్ జగదీష్ సినిమాలోని ఓ అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : టక్ జగదీష్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్   
సాహిత్యం : చైతన్య ప్రసాద్ 
గానం : శ్రేయ ఘోషల్, కాలభైరవ  

ఇంకోసారి ఇంకోసారి
నీ పిలుపే నా ఎదలో చేరి
మళ్లోసారి మళ్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి

మనసుకే మొదలిదే మొదటి మాటల్లో
వయసుకే వరదిదే వలపు వానల్లో
కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో
తగదనీ తెలిసినా చివరి హద్దుల్లో

నా రాదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో 
పున్నాగల పూచావేమో

ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే

ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే

కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో
గుండె అల్లాడేలా 
నవ్విస్తావు నీవు నీ కొంటె కొణాలతో
చంటి పిల్లాడిలా 
కన్నె ఈడు కోలాటమాడింది 
కంటిపాపలో నిన్నే దాచింది
నిన్నలేని ఇబ్బంది బావుంది
నిన్నుకోరి రమ్మంటుందే

నా రాదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండెల్లో నా గుండెల్లో 
పున్నాగల పూచావేమో

ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే

ఎగరేసేయ్ ఊహల్నే ఎగరేసేయ్ ఊహల్నే
చెరిపేసెయ్ హద్దుల్నే చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే చూసేద్దాం చుక్కల్నే

ఇంకోసారి ఇంకోసారి
నీ పిలుపే నా ఎదలో చేరి
మళ్లోసారి మళ్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.