బుధవారం, మార్చి 17, 2021

ఏలో ఏలో ఏలేలో...

భారీ తారాగణం సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భారీ తారాగణం (2021)
సంగీతం : సుక్కు 
సాహిత్యం : సుక్కు 
గానం : యాసిన్ నిజార్ 

మందార పువ్వల్లె 
నవ్వుతుంటే నువ్వు ఆగలేకపోతున్నా
మనసు మబ్బుల్లో తేలి 
ఊగితే ఉయ్యాల ఆపలేకపోతున్నా
వయసు నడిచే నదిలా పడినది నీ వెనక
వలపు కురిసే జడిలా మారినదీ గనుక
ఊ అంటే పిల్లా రాసిస్తా మళ్ళా 
వందేళ్ల నీ కానుక

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

ఓ..! ఆకలంటూ లేదుకానీ 
అంతులేని ఆరాటమే ఉంది
నిద్దురంటూ రాదు కాని 
కళ్ళ నిండా నీ కలే ఉంది
ఆకలంటూ లేదు కానీ 
అంతులేని ఆరాటమే ఉంది
నిద్దురంటూ రాదుకాని 
కళ్ళ నిండా నీ కలే ఉంది
యేమారిపోయాను 
నే మారిపోయాను 
నీ కొంటె ఊహల్లో పడి
చేజారి పోయాను 
నే పారిపోయాను 
నీ వైపే నా నుంచి వలువడి
నీ పైన నా ప్రేమ బలపడి

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో

ఉన్నట్టుండి ఉప్పెనలా 
గుండె ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే 
ఆశ కొత్త రంగేసుకుంది
ఉన్నట్టుండి ఉప్పెనలా 
గుండె ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే 
ఆశ కొత్త రంగేసుకుంది
తెల్లారి చల్లేటి కళ్ళాపిలాగ 
నవ్వుతుంటే నువ్వు అలజడి
సందేళ సూర్యున్ని జాబిల్లిలాగ 
కలిసినావే నువ్వు అమ్మడి
ఏ జన్మలోనో రుణపడి

ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలేలో ఏలో 
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.