రంగ్ దే సినిమాలోని నిన్న విడుదలైన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : సిధ్ శ్రీరామ్
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా రేయిపై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
ఎపుడూ లేనీ ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రానీ ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందెనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచినా
గుప్పెడు గుండెకు పండుగ ఆ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.