సోమవారం, మార్చి 01, 2021

సారంగ దరియా...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న కొత్త సినిమా ’లవ్ స్టోరీ’ కోసం తెలంగాణా జానపదానికి చక్కని మాటలు కూర్చారు సుద్దాల అశోక్ తేజ. నిన్ననే విడుదలై యూట్యూబ్ నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : లవ్ స్టోరీ (2021)
సంగీతం : పవన్ సి.హెచ్  
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ 
గానం : మంగ్లీ

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

కాళ్ళకు ఎండి గజ్జల్ 
లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ 
కొప్పుల మల్లె దండల్ 
లేకున్నా చెక్కిలి గిల్ గిల్ 
నవ్వుల లేవుర ముత్యాల్ 
అది నవ్వితే వస్తయ్ మురిపాల్ 
 
నోట్లో సున్నం కాసుల్ 
లేకున్నా తమ్మల పాకుల్ 
మునిపంటితో మునిపంటితో 
మునిపంటితో నొక్కితే పెదవుల్ 
ఎర్రగ ఐతదిరా మన దిల్ 

చురియా చురియా చురియా 
అది సుర్మా పెట్టిన చురియా 
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా
 
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

ఓఓఓ..హోఓఓఓఓ...
హోఓఓఓఓ.. ఓఓఓఓ.. 

రంగేలేని నా అంగీ 
జడతాకితే ఐతది నల్లంగీ
మాటల ఘాటూ లవంగీ 
మర్ల పడితే అది శివంగీ
తీగలు లేని సారంగి 
వాయించబోతే అది ఫిరంగీ
గుడియా గుడియా గుడియా
అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని సెంపల ఎన్నెల కురియా 
దాని సెవులకు దుద్దుల్ మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా 
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా 

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా
దాని ఏజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా
దాని పేరే సారంగ దరియా

ఓఓఓ..హోఓఓఓఓ...
హోఓఓఓఓ.. ఓఓఓఓ.. 


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.