మంగళవారం, మార్చి 23, 2021

కలయిక ఓ మాయ...

A (AD INFINITUM) సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : A (AD INFINITUM) (2021)
సంగీతం : విజయ్ కూరాకుల  
సాహిత్యం : అనంత శ్రీరామ్  
గానం : దీపు, పావని

కలయిక ఓ మాయ పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో పరవశమో మాయ
పెరిగే స్నేహంలో పరిమళమో మాయ
పంచిన ప్రాణంలో పరితపమో మాయ

కలయిక ఓ మాయ పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో పరవశమో మాయ
పెరిగే స్నేహంలో పరిమళమో మాయ
పంచిన ప్రాణంలో పరితపమో మాయ

గడిచే కాలంలో ఓ ఓ ఓఓ ఓఓ
గడిచే కాలంలో గతమంటే ఓ మాయ
నిలిచేటి బంధంలో నిమిషానికో మాయ

కలయిక ఓ మాయ పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో పరవశమో మాయ

ఏ మై నా ఈపైన
అడుగులు నీతోనే అలసట నీతోనే
హా యై నా బాధైనా
చెరిసగమౌతానే బ్రతుకిక నీతోనే
జతలో సాగించే ఓ ఓ ఓఓ ఓఓ
జతలో సాగించే సరదా ఓ మాయ
సరదాలో పంచే సరసం ఓ మాయ
ఒకరా ఇద్దరమా అనిపించే మాయ
ఒకరే ముగ్గురుగా కనిపించే మాయ
 
కలయిక ఓ మాయ పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో పరవశమో మాయ

లో లో చాలా ఉన్న
బయటికి మాటల్లో తెలియదు కొంతైనా
నా లో ఏ ప్రశ్నైనా
ఎదురుగ నీ ప్రేమ బదులుగ నిలిచేనా
అనురాగం చేసే ఓ ఓ ఓఓ ఓఓ
అనురాగం చేసే అల్లరి ఓ మాయ
మమకారం వేసే మంత్రం ఓ మాయ
కలలో వెంటాడే కలవరమో మాయ
నిజమై వెంటుండే నీ పలుకే మాయ
 
కలయిక ఓ మాయ పరిచయమో మాయ
కలిసిన చేతుల్లో పరవశమో మాయ
   

  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.