గురువారం, మార్చి 04, 2021

సత్యమేవ జయతే...

లాంగ్ బ్రేక్ తర్వాత పవన్ నటిస్తున్న ’వకీల్ సాబ్’ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : శంకర్ మహదేవన్, పృథ్వీచంద్ర

జన జన జన.. జనగణమున 
కలగలిసిన జనం మనిషిరా..
మన మన మన.. మన తరపున 
నిలబడగల నిజం మనిషిరా..

నిశి ముసిరిన కలలను 
తన వెలుగుతో గెలిపించు 
ఘనుడురా..
పడి నలిగిన బతుకులకొక 
బలమగు భుజమివ్వగలడురా..

వదలనే వదలడు.. 
ఎదురుగా తప్పు జరిగితే..
ఇతనిలా ఓ గళం 
మన వెన్ను దన్నై పోరాడితే..

సత్యమేవ జయతే.. 
సత్యమేవ జయతే..

జన జన జన.. జనగణమున 
కలగలిసిన జనం మనిషిరా..
మన మన మన.. మన తరపున 
నిలబడగల నిజం మనిషిరా..

నిశి ముసిరిన కలలను 
తన వెలుగుతో గెలిపించు 
ఘనుడురా..
పడి నలిగిన బతుకులకొక 
బలమగు భుజమివ్వగలడురా..

గుండెతో స్పందిస్తాడూ
అండగా చెయ్యందిస్తాడు

ఇల చెంప జారెడి ఆఖరి 
అశ్రువునాపెడి వరకూ అనునిత్యం 
బలహీనులందరి ఉమ్మడి గొంతుగ 
పోరాటమె తన కర్తవ్యం

వకాల్త పుచ్చుకుని 
వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి 
కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని 
కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి 
పెట్టిస్తాడు దండాలు 
ఇట్టాంటి ఒక్కడుంటే 
అంతే చాలంతే 
గొంతెత్తి ప్రశ్నించాడో 
అంతా నిశ్చింతే 
ఎట్టాంటి అన్యాయాలు 
తలెత్తవంతే 
మోరెత్తే మోసగాళ్ళ 
పత్తా గల్లంతే 

సత్యమేవ జయతే 
సత్యమేవ జయతే 
సత్యమేవ జయతే 
సత్యమేవ జయతే 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.