గురువారం, మార్చి 25, 2021

కలలో కనుపాపే...

కపటధారి సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కపటధారి (2021)
సంగీతం : సైమన్ కె.కింగ్   
సాహిత్యం : వనమాలి  
గానం : ప్రదీప్ కుమార్ 

కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే 
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే

కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే 
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే

నిలపద నా ఆకాశం 
నీ నవ్వుల నక్షత్రం 
ఎదుటే ఎపుడూ
వెనకటి నా ఆనందం 
మరలద ఇక నా కోసం 
జతగా ఇపుడూ
నా నిజం కలగా 
ఈనాడిలా కథగా 
మార్చేస్తుంటే మౌనంగానే 
నమ్మే తీరాలా ఈ వేళా

కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే

నడిచిన నా ప్రతి అడుగు 
వెతికెనులే నీ కొరకు నిదురే మరిచి
నిను విడువక నీ ఒడిలో గడిపిన 
నా ప్రతి నిమిషం రాదా తిరిగీ
ఆయువే అలసి నా ఆశలే ముగిసి
నీవేలే నీ నా లోకంలో 
నేనేమౌతానో ఈ వేళా

కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే 
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే


 
      

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.