లవ్ స్టోరీ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : లవ్ స్టోరీ (2021)
సంగీతం : పవన్ సిహెచ్
సాహిత్యం : మిట్టపల్లి సురేందర్
గానం : అనురాగ్ కులకర్ణి
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే
మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో
మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా
ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ
రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి
నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటోంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ
ఆఆ ర రా ఆఆ ఆఆ…
ఈ కాలం కన్న
ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తాననీ
నీలి మేఘాలన్ని పల్లకిగ మలిచి
నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోన
ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై
నిలిచిపోవాలనీ
ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.