సోమవారం, మార్చి 08, 2021

మగువా మగువా...

మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వకీల్ సాబ్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్   
సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి 
గానం : సిధ్ శ్రీరామ్  

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా 

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత
స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 
గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా

నీ కాటుక కనులు విప్పారకపోతే 
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే 
ఏ మనుగడ కొనసాగదుగా
 
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా 
అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా 
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో 
 
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా 

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 
గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.