ఆదివారం, మార్చి 21, 2021

చిటికేసే ఆ చిరుగాలి...

అరణ్య సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అరణ్య (2021)
సంగీతం : శంతను మొయిత్రా
సాహిత్యం : వనమాలి 
గానం : హరిచరణ్ 

చిటికేసే ఆ చిరుగాలి  
చిందేసి ఆడే నెమలి 
కిలకిలమని  కోకిల వాలి
పాడెనులె హాయిగ లాలి 

అడివంతా ఒకటై
ఆహ్వానమే పలికనీ

ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ
ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ

చిటికేసే ఆ చిరుగాలి
చిందేసి ఆడే నెమలి
అడివంతా ఒకటై
ఆహ్వానమే పలికనీ

ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ
ఆడనీ! పాడనీ!
చిందులే వెయ్యనీ

చుక్కలేడి కూనల్లారా 
అడివమ్మ పాపల్లారా
అందమైన లోకం ఇదీ 
అందుకో మరి అంటున్నదీ 
హోయ్

కొమ్మల్లో పూచే పూలూ 
కురిపించెను అక్షింతల్లూ
అల్లరి చేసే తెమ్మెరలు 
పూసెనులే సుమగంధాలు
సాగే నీ దారుల్లో
హరివిల్లునే దించనీ 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.