మంగళవారం, మార్చి 09, 2021

కోల కళ్ళే ఇలా...

వరుడుకావలెను సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వరుడు కావలెను (2021)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్    
సాహిత్యం : రాంబాబు గోసల  
గానం : సిధ్ శ్రీరామ్  

చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
పువ్వులా నా ఊహల గుమ్మంలో
తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే
కొంచమైనా ఇష్టమేనా 
అడుగుతుందే మౌనంగా నా ఊపిరే
దూరమున్నా చేరువవుతూ
చెప్పుకుందే నాలోని ఈ తొందరే

కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే
పూల జల్లు తేవే

నువ్వెళ్ళే దారులలో
చిరుగాలికి పరిమళమే
అది నన్నే కమ్మేస్తూ ఉందే
నా కంటి రెప్పలలో
కునుకులకిక కలవరమే
ఇది నన్నే వేధిస్తూ ఉందే
నిశినలా విసురుతూ శశి నువ్వై మెరవగా
మనసులో పదనిసే ముసుగే తీసెనా
ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా
మన కదే మలుపులే కోరేనా

కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళి మళ్ళి రావే
పూల జల్లు తేవే

చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
నాన నానా నా నాన నానా నా
నాన నానా నానా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
నాన నానా నా నాన నానా నా
మళ్ళి మళ్ళి రావే



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.