శంకర్-ఎహసాన్-లాయ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శంకర్-ఎహసాన్-లాయ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, సెప్టెంబర్ 10, 2020

ఉండలేనంది నా కన్ను...

ఈ రోజు అష్టమి రోహిణి / శ్రీ కృష్ణ జన్మాష్టమి సంధర్భంగా ఆ కన్నయ్యకు నమస్కరించుకుంటూ ఈ అందమైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : విశ్వరూపం (2013)
సంగీతం : శంకర్ ఎహ్‍సాన్ లాయ్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్, కమల్‍హాసన్

అధినవనీతా అభినయ రాజా 
గోకుల బాలా కోటి ప్రకాశా 
విరహ నరక శ్రీ రక్షక మాలా 

కమ్మని కలలను కదిపితె చాలా
కన్నియ కౌగిలి చేరగలేవా
ఊహల వాకిట ఉండకురా 
కల వెన్నెల చిందు వరమ్మీరా 

పూతన గర్వమణంచిన వాడా 
పాపపు విరహము బలిగొన రారా
మనసుంటే మాయా వీరా రారా రారా
మనసుంటే మాయా వీరా రారా రారా
మనసుంటే మాయా వీరా రారా రారా

ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు

శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా 
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా 

కృష్ణా ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
నింగి మేనైన నీలాల కల నీవు
అందిరావు అలా నన్ను విడిపోవు
కాస్తైనా మొరాలించవే
గుండె సడినాపి గుండె సడినాపి
గుండె సడినాపి గుండె సడినాపి
గమదనిసా నిదపమ గమ రిగరిస
గుండె సడినాపి నీ దారి కాచానిలా
వెన్నదొంగా మరి వేధించకు
నళిన మోహన శ్యామల రంగా
ధీం ధీం కిడతకధిన
నటన భావ శ్రుతిలయ గంగా
కిడ తక ధీం ధీం ధీన్నా
నిదురను నీకై త్యజించు
అనవరతము నిన్ను కొలుచు
రాధే నీ చెలియని 
నీ రాధే నేనని రారాదా

ఎవ్వేళ నువ్విలా రివ్వందువోయని
రవ్వంత ముస్తాబు పెంచుకున్నా
ఒళ్లంత కళ్లుగా వేచానొక్కోయుగం
వెల్లువల్లె రారా క్షణమాగనిదే
నిన్ను చూపించదే జగం
వాడిపోదా ప్రియా సుమం
ఓ... దొంగచాటు కౌగిలింతై... ఈ...
పరిమళాల శ్వాసనివ్వు
తేనెలూరు పెదవంచుల్లోన
కేరింతగా ఫలించూ
ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదనే
తన్మయి నేనై తరించాలిరా

వదిలిపోని వలపై పైయ్యెదగ
హత్తుకోలేవా చెలిని చెలినీ 
కన్నా తుడిచేసి నా నిదుర 
విడిచి వెళ్లకంటున్నా కలని కలనీ...

ఇక ఈ జన్మలో..నా నువ్వు కనిపించులోనా
చెలి ప్రాణాలు పోతే ఎలా
అని కొరగాని ఆరాటమేలా ప్రియా
నువ్వె ఊపిరిగా జీవించనా
తకతకతకధిం తకతకధిం 
తకతకధిం తకతకధిం
తకధిం తకధిం తోం తోం తకిటితోం
తకధిళాంగుతోం తోంకిటత
తక తరికట తక తరికట 
తక తరికట తక తరికట 
తక తరికట తక తరికట 

శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా 
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా 
 

మంగళవారం, డిసెంబర్ 03, 2019

కలిసుంటే నీతో ఇలా...

సాహో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సాహో (2019)
సంగీతం : శంకర్ ఎహ్ సాన్ లాయ్ 
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : శంకర్ మహదేవన్,
శ్వేతా మోహన్, సిద్దార్థ్ మహదేవన్

కలిసుంటే నీతో ఇలా
కలలానే తోచిందిగా
తలవంచి ఆకాశమే
నిలిచుందా నాకోసమే

కరిగిందా ఆ దూరమే
వదిలెళ్ళా నా నేరమే
నమ్మింక నన్నే ఇలా
తీరుస్తా నీ ప్రతి కల

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

 
(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

నీకంటూ సరిపోనని
అనుకున్నా రావద్దనీ
అటుపైనే తెలిసిందిలే
నేనుందే నీలో అనీ


విడదీసే సందేహమే
వదిలేస్తే సంతోషమే
కాలాలే కలిపాయిలే
కోపాలే కాలాయిలే

(Baby Won't you tell me

 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

 
 (Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

 
  ఇంతింత దూరాలే చేరి
పంతాలు వీడాలి మనసే
నిజమేమిటో
తెలియదా అదే క్షణం

నిద్దరలో లేకున్నా కల
నేడొచ్చి నీ కళ్ళు చేరేలా
చూపించనా
ఆనాటి గురుతులే

నీతో లేకున్నా నీలో ఉన్నాలే
నీకొచ్చే కలలన్నీ నేనూ కన్నాలే

నీచేతి బొమ్మే గీతల్ని దాటి ప్రాణమొచ్చి
నీ కళ్ళముందుంది చూడవా

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||
 
 
(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2|| 


ఆదివారం, మే 12, 2019

రా కన్నా...

మాతృదినోత్సవం సంధర్బంగా అమ్మలందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ మణికర్ణిక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మణికర్ణిక (2019)
సంగీతం : శంకర్ ఎహ్సాన్ లాయ్  
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : హంసిక అయ్యర్

కిలకిల నవ్వు గలగల నవ్వు
మంగళ వేళ నేడేలే
అంతఃపురానా అందాలమైనా
హాయిగ నవ్వితే వేడుకలే

కిలకిల నవ్వు గలగల నవ్వు
మంగళ వేళ నేడేలే
అంతఃపురానా అందాలమైనా
హాయిగ నవ్వితే వేడుకలే


ఎదురు చూపులే చాలూ
ఎదురు చూపులే చాలూ
రారా కన్నా రారా
రాచ వీధి నీకోసం వేచి చూసె రారా

ఈ బంధం నీతో నిత్యం కదా
మరిఇక భయమేలా మనసా ఇలా
నా బ్రతుకే నీవు కదా
ఇక రారా రారా రారా
నిను గన నా కనులారా
రా కన్నా..
ఎదురు చూపులే చాలూ


తలవాకిట లేడు తను
వస్తాడో ఇక రాడో
పూలన్నీ తనకోసం పూచినవో లేదో
వాస్తావే నాడు నువ్వు
వెలుగే తెస్తావు నువ్వు
ముసిరేను నిశలే నా మోములోన  

ఈ బంధం నీతో నిత్యం కదా
మరి ఇక భయమేలా మనసా ఇలా
నా బ్రతుకే నీవు కదా
సూర్యుడు నా చెంత ఉన్న చీకటిదేలా
రా కన్నా..ఆఆఅ...


చంద్రుడిలో ప్రభ నీదే అదుగో అగుపించే
నీ ఒచ్చే సందేశం చిలిపి గాలి తెచ్చే
ప్రతి మదీ శుభాలు పంచె
ఆకశం ఆశీర్వదించె
కసిగా కరిమబ్బే కమ్మినదేలా 

ఈ బంధం నీతో నిత్యం కదా
మరిఇక భయమేలా మనసా ఇలా
నా బతుకే నీవు కదా
నా ఊపిరిలో ఊపిరివై పోయావులే
రా కన్నా... రా కన్నా...
రాకన్నా... రా కన్నా... 



ఆదివారం, ఏప్రిల్ 02, 2017

ఒక్కడంటే ఒక్కడే...

విశ్వరూపం చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పూర్తి సీన్ తమిళ్ వీడియో ఇక్కడ.


చిత్రం : విశ్వరూపం (2013)
సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్
రచన : రామజోగయ్య శాస్త్రి
గానం : సూరజ్ జగన్

ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం

ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే
ప్రళయపు ముఖమితడే

ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే
మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం
అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే
లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం
రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం

నిప్పుల్లోని తీక్షణై సత్తువున్న లక్ష్యమై
చీకటంత చీల్చుతుంది ఈ మగాడి సొంత రూపం
ఏ క్షణాన ఏ రకం మార్చుతుందో వాలకం
మాటకైన చెప్పదే ఈ మగాడి విశ్వరూపం

ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే
ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే
చెరగని మెరుపితడే భయమెరుగని గెలుపితడే
సమయము చూసి ముప్పును ముంచే
ప్రళయపు ముఖమితడే

రూపం రూపం రూపం
రూపం రూపం రూపం
రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం
విశ్వ రూపం రూపం రూపం


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.