సోమవారం, నవంబర్ 08, 2010

పొద్దున్నేమో ఓ సారీ - బొ.బ్ర.చం.సి.

జంధ్యాల గారి హయాంలో హాస్య చిత్రాలలో కూడా ఆణిముత్యాల లాంటి పాటలు ఉంటుండేవి ఆ తర్వాత కాలంలో పూర్తిగా వినడం మానేశాను. కాని తర్వాత కాలంలో సంగీత దర్శకురాలు శ్రీలేఖ పుణ్యమా అని ఎప్పుడో అమావాస్యకో పున్నానికో ఇలాంటి ఒక మంచి పాట వినే అదృష్టానికి నోచుకుంటున్నాం. సాథారణంగా హాస్య చిత్రాలు చూసేప్పుడు పాటలు ఫార్వార్డ్ చేసే నేను ఈ రోజు అనుకోకుండా ఈ పాట వినడం జరిగింది వెంటనే మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం, విని ఆనందించండి. పూర్తిపాట వీడియో దొరకలేదు కనుక పూర్తిగా వినడానికి కింద ఇచ్చిన రాగా ప్లేయర్ లోడ్ అయ్యాక దాని ప్లేబటన్ పై క్లిక్ చేయండి.



చిత్రం: బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్
సంగీతం: శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తీక్, శ్వేత

చెలీ .. తొలి కలవరమేదో
ఇలా .. నను తరిమినదే
ప్రియా .. నీ తలపులజడిలో
ఇంతలా .. ముంచకే .. మరీ !

పొద్దున్నేమో ఓ సారీ .. సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?

ముగ్గే పెడుతూ ఓ సారీ .. ముస్తాబవుతూ ఓ సారీ ..
ఏదో అడగాలనిపిస్తోంది .. What shall I do?

కొత్తగా .. సరికొత్తగా .. చిరుగాలి పెడుతోంది కితకితా
ముద్దుగా .. ముప్పొద్దులా .. వయసుడికిపోతుంది కుతకుతా
ఏమైనా ఈ హాయి తరి తరికిటా !

తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!

పొద్దున్నేమో ఓ సారీ .. సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?

అతిథిగ వచ్చే నీకోసం స్వాగతమౌతానూ
చిరునవ్వై వచ్చే నీకోసం పెదవే అవుతానూ
చినుకై వచ్చే నీకోసం దోసిలినౌతానూ
చిలకై వచ్చే నీకోసం చెట్టే అవుతానూ

చాటుగా .. ఎద చాటుగా .. ఏం జరిగిపోతుందో ఏమిటో
అర్ధమే .. కానంతగా .. ఎన్నెన్ని పులకింతలో
తొలిప్రేమ కలిగాక అంతేనటా !

తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!

అలలా వచ్చే నీకోసం సెలయేరౌతానూ
అడుగై వచ్చే నీకోసం నడకే అవుతానూ
కలలా వచ్చే నీకోసం నిదురే అవుతానూ
చలిలా వచ్చే నీకోసం కౌగిలినౌతానూ

పూర్తిగా .. నీ ధ్యాసలో .. మది మునిగిపోతోంది ఎందుకో
పక్కనే .. నువ్వుండగా .. ఇంకెన్ని గిలిగింతలో
నాక్కూడా నీలాగే అవుతోందటా !

తరికిటా .. తరికిటా .. తరికిటా తోం తరికిటా !
తరికిటా .. తరికిటా .. తరికిటా నం తరికిటా !!

పొద్దున్నేమో ఓ సారీ .. సాయంకాలం ఓ సారీ ..
నిన్నే చూడాలనిపిస్తోంది .. What can I do?

ముగ్గే పెడుతూ ఓ సారీ .. ముస్తాబవుతూ ఓ సారీ ..
ఏదో అడగాలనిపిస్తోంది .. What shall I do?

కొత్తగా .. సరికొత్తగా .. చిరుగాలి పెడుతోంది కితకితా
ముద్దుగా .. ముప్పొద్దులా .. వయసుడికిపోతుంది కుతకుతా
ఏమైనా ఈ హాయి తరి తరికిటా !
 
Lyrics copied with minor corrections from పాటల పల్లకి

సోమవారం, నవంబర్ 01, 2010

ఘనా ఘన సుందరా

పాత భక్తిపాటల్లో కొన్ని మనసుకు అలా హత్తుకు పోతాయి. అలాంటి పాటల్లో దేవులపల్లి గారు రచించగా ఆదినారాయణ గారు స్వరపరచిన "ఘనా ఘన సుందరా" ఒకటి. భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ బాగుంటాయి కానీ ఈ పాట ప్రత్యెకతే వేరు. దేవులపల్లి గారు చక్కని పదాలతో ప్రభాత వేళను కనుల ముందు నిలిపితే అందమైన సంగీతం లో ఘంటసాల గారి గాత్రం తన్మయత్వంతో ఊయలలూగిస్తుంది. నాకు సంగీతంతో పరిచయం లేదు కానీ ఈ పాట మోహన రాగం లో చేసినదని అందుకే అంత మాధుర్యం అనీ ఎక్కడో చదివాను. ఈ పాట చరణం చివర ఘంటసాల గారు పైస్థాయిలో "నిఖిల జగతి నివాళులిడదా" అన్న వెంటనే ఆర్తిగా "వేడదా.. కొనియాడదా.." అన్నచోట ఒక్కసారిగా మనకు మనమే ఆ స్వామికి అర్పించుకున్న అనుభూతి కలుగుతుంది.

ఇంకా ఈ పాట ఎప్పుడు విన్నా చిన్నతనంలో ఉదయాన్నే గుడిలో మైకుద్వారా విన్నప్పటి రోజులలోకి వెళ్తూ ఆనందానుభూతిని పొందుతాను. మీరు గమనించారోలేదో పాత గ్రామ్ ఫోన్ రికార్డ్ లలో పాటలు వింటున్నపుడు ఒక విథమైన చిర్పింగ్ సౌండ్ వస్తుంది, కొన్ని పాటలు పూర్తి క్లారిటీ తో వినడం కంటే ఆ చిర్పింగ్ సౌండ్ తో వినడం లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇది కూడా అలాంటి పాటలలో ఒకటి. పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. ఆలశ్యమెందుకు మీరు కూడా చూసి విని ఆనందించండి. వీడియోలో ఆడియో క్లారిటీ అంత బాగాలేదు, ఆడియో మాత్రమే వినాలంటే చిమటా మ్యూజిక్ లో ఇక్కడ వినచ్చు.  

 

చిత్రం : భక్త తుకారం
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల

హరి ఓం... ఓ. ఓం..
హరి ఓం... ఓ. ఓం..
హరి ఓం... ఓ. ఓం..
ఆ-అ-అ-అ-అ-ఆ... అ-ఆ...
ఆ.ఆ... ఆ.ఆ... ఆ... అ-ఆ...

ఘనా. ఘన సుందరా...
కరుణా.. రస మందిరా.
ఘనా. ఘన సుందరా..
కరుణా.. రస మందిరా. ..
అది పిలుపో.. మేలు కొలుపో..
నీ పిలుపో.. మేలు కొలుపో..
అది మధుర. మధుర.
మధురమౌ ఓంకారమో.. ..

పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా...
కరుణా.. రస మందిరా...
ఆ... అ-అ-ఆ..
.....

ప్రాభాత మంగళ పూజావేళ..
నీపద సన్నిధి నిలబడీ...
నీపద పీఠిక తలనిడీ..

ప్రాభాత మంగళ పూజావేళ..
నీపద సన్నిధి నిలబడి...
నీపద పీఠిక తలనిడీ..

నిఖిల జగతి నివాళులిడదా..
నిఖిల జగతి నివాళులిడదా..
వేడదా.. కొనియాడదా..

పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా
కరుణా.. రస మందిరా
ఆ... అ-అ-ఆ..
 
గిరులూ ఝరులూ..
విరులూ తరులూ..
నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే...

గిరులూ ఝరులూ..
విరులూ తరులూ..
నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే...

సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
శ్రీకరా... భవహరా...

పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
కరుణా.. రస మందిరా.అ-అ-ఆ..
ఆ... అ-అ-ఆ..
ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...


 ఈ సాహిత్యం ఈ సైట్ నుండి స్వల్ప మార్పులతో సంగ్రహించబడినది.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.