మిత్రులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంగ్ దే సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రంగ్ దే (2021)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : శ్వేతా మోహన్
నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందే
నీవెంటే నేనుంటే
పాదాలకె పసుపు పుసిందే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు
ఆ క్షణము రంగు తెలుపు
నా కాటుకిష్టం అన్నావో
ఆ పూట రంగు నలుపు
నీ చేతి స్పర్శే తాకిందో
నా ఒంటి రంగు చెంగావి
నీ మౌనమే ఓ ముల్లైతే
నా పలుకు రంగు గులాబీ
జగామాడే రంగేళి ఏడాదికోసారి
నాలో ఈ హోళిలే
నిమిషానికోసారి నీ వల్లే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
కన్ను చూడనన్ని కొత్త రంగులే
నువ్వు పలకరించే ప్రతిసారి
ఆ పులకరింతది ఏ రంగో
నీ మెప్పు పొందే ప్రతిసారి
నా గొప్పతనమది ఏ రంగో
నువు కోపగించె సమయంలో
నా బుజ్జగింపుది ఏ రంగో
నువ్వు విడిచి వెళ్లే వేళల్లో
నా ఏదన వేదనదే రంగో
హరివిల్లే ఆ ఏడూ రంగుల్ని మించదులే
నా మనసే నీ వల్లే
వేవేలా రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
పేరులేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే
నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే
పేరులేనివెన్నో కొత్త రంగులే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.