శుక్రవారం, జనవరి 01, 2016

లాహిరి లాహిరి లాహిరిలో...

మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మనందరి జీవితాలు ఈ నౌకా విహారమంత ఆనందంగా హాయిగా సాగాలని కోరుకుంటూ మాయాబజార్ చిత్రంలోని ఈ చక్కని పాట. నల్లనయ్య నౌకా విహారాన్ని కన్నుల పండువగా చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, పి.లీల

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా
 
ఆ... ఆ...ఆ... ఆ...ఆ... ఆ...

తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో
ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో..
పూల వలపుతో ఘుమఘుమలాడే
పిల్ల వాయువుల లాలనలో

లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
 
వూగేనుగా తూగెనుగా
ఆ... ఆ...ఆ... ఆ...

అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో.. మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమానౌకలో
హాయిగ చేసే విహారణలో

 
లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా సాగెనుగా
ఆ... ఆ...ఆ... ఆ...ఆ... ఆ...

 
రసమయ జగమును రాసక్ఱీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో
రసమయ జగమును రాసక్ఱీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే
చల్లని దేవుని అల్లరిలో...
 
 
లాహిరి లాహిరి లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా
వూగేనుగా తూగెనుగా
ఆ... ఆ...ఆ... ఆ...ఆ... ఆ..

4 comments:


తారాచంద్రుల విలాసములతో
విరిసే స్వీటు సిక్ష్టీను పరవడిలో ఉరవడిలో

నూతన సంవత్సర శుభాకాంక్షల తో

జిలేబి

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

జిలేబి గారు, లాస్య గారు, నీహారిక గారు మీ అందరకూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియూ ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail