మంగళవారం, జనవరి 05, 2016

శ్రీ వేణుగోపాలా...

అమరశిల్పి జక్కన్న ఆ వేణుగోపాలుని ఎలా స్తుతించాడో ఈ చక్కని పాటలో విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)
సంగీతం : ఎస్.రాజేశ్వర రావు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : ఘంటసాల, సుశీల, బృందం

శ్రీ వేణుగోపాలా..ఆ.. చిన్మయానంద లీలా
నారాయణ విజయనారాయణ నారాయణా పాహీ..ఈ..
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా..
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా..
తనువూ, మనసూ తరియించె ఈ వేళా..
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా..

ఎండిపోయిన గుండెలలోన 
పండువెన్నెల చిలికితివీవు
తోడునీడగ మా దరినిలిచి 
కావుమా, కరుణాజలధి
తరమా! వరదా..ఆ.. కొనియాడ నీ లీలా.. 

శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా!
 
శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా!
నాట్యకళా మోహనా, సకలలోక పావనా
నాట్యకళా మోహనా, సకలలోక పావనా
శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా!
శరణు చెన్నకేశవా! శరణు దీనబాంధవా!

 
నీవే తల్లివి తండ్రివి మాకు జీవనదాతవు నీవె ప్రభూ!
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. 
నీదు సేవయే జీవనరక్ష, నీదు సన్నిధే పెన్నిధిరా
ఒ ఓ..ఓ..ఓ ఓ ఓ 
నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా
నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా 
నందనందనా గోవిందా, భక్తచందనా గోవిందా

చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా

చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా
చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా చెన్నకేశవా
కేశవా…నా…. తరమా… వరదా..
కొనియాడ నీ లీలా… కేశవా..
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా
చెన్నకేశవా, పాహీ చెన్నకేశవా


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail