సోమవారం, మార్చి 03, 2014

పరువాలు కనివిని

కమలహాసన్ అమల నటించిన "సత్య" సినిమా కోసం ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఓ అందమైన పాట, ఇంచుమించు ఇదే లైన్స్ లో నిర్ణయం సినిమా కోసం "ఎపుడెపుడెపుడని అడిగెను" అనే పాట కూడా కంపోజ్ చేశారు. ఈ పాట చిత్రీకరణ సైతం సురేష్ కృష్ణ చాలా చక్కగా తీశారు. ఈ అందమైన పాటను మీరూ అస్వాదించండి, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : సత్య (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ (??)
గానం : బాలు, సుశీల 

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


కలలూరించనీ నీకళ్ళు చెలరేగించనీ పరవళ్ళు
నీచూపులో వుంది మందారం 
అది నాకు కావాలి సింధూరం
రాగాల నీ నవ్వులోన రతనాలు నేనేరుకోనా
ఊరింత కవ్వింత పులకింత కలిగేను 
కరిగేను నీ చెంత ఒళ్ళంతా

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణ
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో

లాలలాలలాలా..లాలా..మ్.ఊఊఊ..
లాలలాలలాలా..లాలా..హే...
లాలాలాలాలలా..లాలాలాలాలలా..

అపురూపం కదా నీ స్నేహం 
అనురాగానికే శ్రీకారం
అణువణువు నీలోన వున్నానే
అనుబంధమే పంచుకున్నానే
నీ కంటి పాపల్లె నేను.. 
వుంటాను నీ తోడు గాను
నీ మాట నా పాట కావాలీ 
నీ వెంట ఈ జంట కలకాలం సాగాలి

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో 
 
ఈనాడు ఏనాడూ నేను నీ కోసం
నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం
 
పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని
కవితలు పలికే మూగ కళ్ళలో
జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు
తలుపులు తెరిచే ప్రేమ వీధిలో

3 comments:

వేణూజీ, రోఝూ...ఇది ఎంత మంచి పాటో.. నాకిష్టం! అని రాయలేం, మానలేం :-) మంచి మంచి పాటలు పెడుతున్నారు బాగుంది.
గౌతమి, అమ్లా, వాణి విశ్వనాథ్ మొదలైన ఆ కాలపు నటీమణులు నాకు బాగా నచ్చేవారు. వీళ్ళకు రావాల్సినంత పేరు రాలేదని కూడా నాకనిపిస్తూ ఉంటుంది..

హహహ తృష్ణ గారు యూ మేడ్ మై డే :-)) థాంక్సండీ.. గౌతమి, అమల గురించి మీరు చెప్పింది కరెక్టండీ.

యాక్ట్చువల్ గా చాలా వైలెన్స్ వున్న మూవీ సత్య..బట్ కమల్ యాక్షన్ యెప్పుడైనా రెప్ప వేయకుండా చూసేలా చేస్తుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail