మంగళవారం, మార్చి 25, 2014

నాదం నీ దీవనే...

ఇళయరాజా గారి మరో మధురమైన కంపొజిషన్... జానకమ్మగారి స్వరంలో వేటూరి గారి అక్షరాలు ఆ అమ్మాయి ప్రేమని ఆరాధనని మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. తెలుగు వీడియో దొరకలేదు తమిళ్ వీడియో ఎంబెడ్ చేశాను. భారతీరాజ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాధ చాలా చక్కగా ఉంటుంది ఇందులో. ఈ పాట తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రాగమాలిక (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

అమృతగానం ఈ అనురాగం నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై ఎగసి ముగిసిపోదునే
కన్నుల మౌనమా కలకే రూపమా
దాచకే మెరుపులే పన్నీర్ మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే

నాదం నీ దీవనే

కోయిలల్లే నాద మధువే పొందకోరే దీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే
కోవెల బాటలో పువ్వుల తోరణం
ఎంతకూ మాయని తియ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

4 comments:

nice song! tamil song is also sweet.thanks for the link :)

థాంక్స్ తృష్ణ గారు.. :-)

ఇసై జ్ఞాని ఇళైరాజా గారి అద్భుతమైన సంగీత బాణీలలో..అమృతమంటి పాట..ఇందులోని "నదికి ఆందం " పాట కూడా ప్రెజంట్ చేయండి వేణూజీ..

థాంక్స్ శాంతి గారు, అలాగేనండీ ఆపాట కూడా త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail