ఆదివారం, మార్చి 23, 2014

ఊరుకో ఊరుకో బంగారుకొండా..

ఆత్మబంధం సినిమాలోనిదే మరో చక్కనిపాట. ఏడ్చే బుజ్జాయిని బుజ్జగించే పాట. చాలాబాగుంది మీరూ వినండి. ఈ పాటని ఈ క్రింది ఎంబెడ్ చేసిన యూట్యూబ్ ఫైల్ లో 8:45 వరకూ ఫార్వార్డ్ చేసికానీ లేదా ఇక్కడ క్లిక్ చేసి కానీ వినవచ్చు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఆత్మబంధం (1991)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల    
గానం : బాలు, చిత్ర

ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేజారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా

ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా
చల్లబడకుంది ఎడారి ఎదలో..
జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా
మొండి ఊపిరింకా మిగిలుందీ... 
 చల్లని నీ కళ్ళలో కమ్మనీకలనేను
చెమ్మగిల్లనీయకుమా కరిగిపోతానూ

దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేజారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా


ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా

గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమనీ
తప్పుపట్టి తిట్టేవారేరీ... తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా
అంటూ ఊరడించే నాన్నేరీ

చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేననీ
జన్మలెన్ని దాటైనా చేరుకుంటాననీ
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయిజారిపోయిన జాబిల్లినీ...
తేలేని తల్లినీ ఏడిపించకుండా

ఊ...రుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ...
చేయిజారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా
...

4 comments:

Venu gaaru.. naa kosam bhairava deepamlo, Sri tumubura nArada.. song swarAlato paaTu post cheyagalaru.plzzz:):)

అలాగే కార్తీక్ గారు త్వరలో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

థాంక్యు సో మచ్ ఫర్ పోస్టింగ్ ద సాంగ్ వేణూజీ..పిక్ కూడా చాలా బావుంది..

గ్లాడ్ యూ లైక్డ్ ఇట్ శాంతి గారు.. థాంక్స్.. ప్లెజర్ ఈజ్ మైన్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail