శనివారం, మార్చి 22, 2014

మనసా వాచా...

వేటూరి గారు, శేఖర్ కమ్ముల, రాధాకృష్ణ కలిస్తే సంగీతాభిమానులకు సంబరమే కదా.. నాకెంతో ఇష్టమైన పాట. మీరుకూడా తనివితీరా ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా 
నడిచా నేనే నీడలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆఆఅ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా.. 
మూగైపోయా నేనిలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

ఆఆఆఅ... 
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా 
రాముని కోసం సీతలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

2 comments:

వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లాసికల్ మెలొడీస్..థాంక్యు వేణూజీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.