గురువారం, మార్చి 06, 2014

ప్రాణమా ప్రాణమా

రెహమాన్ ఫాస్ట్ బీట్ పాటలు ఎంత బాగా కంపోజ్ చేయగలడో మెలోడీస్ అంతకన్నా గొప్పగా కంపోజ్ చేయగలడు అలాంటి ఓ అద్భుతమైన మెలొడీ తెనాలి సినిమాలోని ఈ ప్రాణమా ప్రాణమా పాట. వెన్నెలకంటి గారి సాహిత్యం కూడా బాగుంటుంది ఇక చిత్రగారు ప్రాణమా ప్రాణమా అని అంటూంటే మన పంచప్రాణాలు ఎవరో పట్టి లాగేస్తున్నట్లుగా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదేమో :-) ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు (పోస్టర్ చూసి కన్ఫూజ్ అవకండి అవి తెలుగు పాటలే).చిత్రం : తెనాలి (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

ఎదను దోచి ఏదో చేసి హిహిహి
కళ్లనిండా కలలే దాచి చెంతకీ..

ఎదను దోచి ఏదో చేసి 
కళ్లనిండ కలలే దాచి
ఎదను దోచి ఏదో చేసి హిహిహి
కళ్లనిండ కలలే దాచి
చెంతకీ చేరకా ఊరింతువేలా..
ప్రాణమా... ప్రాణమా..

ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా
ప్రాణమా… ప్రాణమా…
ప్రాణమా… ప్రాణమా…

ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి
ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి
చెంతకీ చేరకా ఊరింతువేలా..
ప్రాయమా.. ప్రాయమా..
ప్రాయమా.. ప్రాయమా.. 
నన్ను చూసి నన్నే చూసి కళ్లతోటి కలలే దోచి
తీయని మోహాల మరిగింతువేలా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా

కలిసిన కళ్లే కలలకు ఇళ్లై
వయసును గిల్లే మన్మధ విల్లై
కలిసిన కళ్లే కలలకు ఇళ్లై
వయసును గిల్లే మన్మధ విల్లై
హాయిగా ఊగే ఊయలలూగే
అందం ఎరవేసే చందమేదో సాగే
ఆశల గోదారి ఎగిసినదంటా
తారల పువ్వులన్నీ
కోసుకుందుమంటా
నిదురించు ప్రేమయె ఉదయించె నేడే
నిదురించు ప్రేమయె ఉదయించె నేడే 
ప్రాణమా… ప్రాణమా…

హృదయాన మోగే ఈ రాగహేల
మధురం కదా ఇక మన రాసలీల
రెక్కలు తొడిగీ తలపులు చాలా
దిక్కులు దాటే ఎద ఈ వేళా
ఎదవీణ దాచే మౌన గీతం నేనే
పున్నాగ విరుల సన్నాయి నీవే
జత నీవనీ నిన్నే వలచి వచ్చానే
ప్రాణమా… ప్రాణమా…

ఎదను దోచి హిహి..
ఎదను దోచి ఏదో చేసి
కళ్లనిండ కలలే దాచి

ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా
పాటే పలికించవా తోడై పులకించవా

ఎదనే నిదురించవా ప్రాణమా…  
ఎదురై మురిపించవా ప్రాణమా…
పాటే పలికించవా తోడై పులకించవా

ప్రాణమా…ఆఅ..అ..

2 comments:

ఈ పాట మనసుకి కిక్కిస్తుంది..

కరెక్ట్ శాంతి గారు, థాంక్స్ :-))

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail