మంగళవారం, ఆగస్టు 11, 2020

ఆశ ఆశగా అడిగింది...

సంక్రాంతి చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

చిత్రం : సంక్రాంతి (2005)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు

స రి ప మా గ రి స రి సా ని స
స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాటతీరు అంటే
బ్రతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం

స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం

కనరాని దైవం కరుణించలేదా 
తలితండ్రులుగా కనిపెంచి
సేవించు భాగ్యం కలిగించ లేదా 
శివపార్వతులై కనిపించి
కైలాసంలా కొలువుంది 
చల్లని మా చెలిమి
కల్మషం మన్నది తెలియంది 
మా మమతల కలిమి
ప్రేమకుమించిన పెన్నిధి ఏముందీ

స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం

హరివిల్లులోని వర్ణాలు అన్నీ 
మా కన్నులలో నిలవాలి
సిరిమువ్వలోని సరిగమలు అన్నీ 
మా గుండెలలో పలకాలి
మా లోగిలిలో ప్రతి రాత్రి 
దీపావళి కాంతి
మాముంగిలిలో ప్రతి ఉదయం 
ముగ్గుల సంక్రాంతి
పున్నమి నవ్వుల పొదరిల్లే మాది

స రి ప మా గ రి స రి సా ని స

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాటతీరు అంటే
బ్రతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా ఈ లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం

స రి ప మా గ రి స రి సా ని స
స రి ప మా గ రి స రి సా ని స
స రి ప మా గ రి స రి సా ని స 


4 comments:

ఇవాళ మీకిష్టమైన కృష్ణుడి జన్మాష్టమి కదా, వేణూశ్రీకాంత్ గారూ. ఈ ఆపాతమధురంతో మీకందరకూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 👇.
(వెతికాను గానీ విడీయో పాట దొరకలేదు)

మోహనరూపా గోపాలా

థ్యాంక్స్ నరసింహారావు గారూ.. మీక్కూడా జన్మాష్టమి శుభాకాంక్షలండి.. ఈ పాట ఈ బ్లాగ్ లో వేసినపుడు కూడా నాకు వీడియో దొరకలేదండీ. లిరిక్స్ లింక్ ఇదిగోండి.
మోహన రూప

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు వేణూజీ..

థ్యాంక్స్ శాంతి గారూ.. మీక్కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.