సూర్యవంశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సూర్యవంశం (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుజాత
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
నువ్వే తోడుగ ఉండే జీవితం
నిటూర్పు జాడేలేని నిత్యనూతనం
నువ్వే నీడగ పంచే స్నేహితం
హేమంతం రానే రాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ
గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ
నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా
రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడిరేయి చేరనీయక సుర్యదీపముంది
మన దారి చూపుతోంది
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
అన్ని రోజులు సన్నజాజులై
అందంగ అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై
గారంగ పెంచుకుందాం స్నేహ బంధనం
రంగేళి సంతోషాల చందనం చల్లుతూ
ఈ గాలి అందుకుంది కొత్త జీవితం
ఉంగాల సంగీతాల రాగమే పాడుతు
సాగాలి సూర్యవంశ సుప్రభాతం
అంచుదాటు అమృతం
పంచుతోంది నిత్యం
మన ప్రేమ పారిజతం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
లాలలాల్ల లల లాలలాల్ల
2 comments:
ఈ మూవీ యెన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుందండీ..
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.