గురువారం, ఆగస్టు 13, 2020

అందమైన కలల కుటీరం...

బలాదూర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బలాదూర్ (2008)
సంగీతం : K.M.రాధాకృష్ణన్  
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : కారుణ్య

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతిదినం 
సుఖశాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం

కనులువేరు చూపులు ఒకటే
తలలువేరు తలపులు ఒకటే
పంచుకున్న ప్రాణం ఒకటే
ఎదలు వేరు స్పందన ఒకటే
పెదవిలోని ప్రార్థన ఒకటే
ఒకరికన్నా ఇష్టం ఒకరే
కంగారై ఎవరున్నా 
ప్రతికన్ను చెమ్మగిల్లేను
కన్నీరై ఎవరున్నా 
పదిచేతులొచ్చి తుడిచేను
సమభావం అన్నది 
సంసారం ఐనది
మా ఇల్లు మమతాలయం
కవి లేని కవితాలయం

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం

కునుకు లేని వాకిలి మాది
అలక లేని అరుగే మాది
మరక లేని మనసే మాది
తెరలు లేని తలుపే మాది
గొడవ లేని గడపే మాది
కరువు లేని కరుణే మాది
ఈ చోట కురిసేటి 
ప్రతి చినుకు జన్మ పావనమే
ఈ తోట విరిసేటి 
ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే
స్వర్గాలే జాలిగా స్థానాన్నే కోరగా
మా ఇల్లు మంత్రాలయం
అనుబంద గంధాలయం

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతిదినం
సుఖశాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం
 

2 comments:

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.