కలిసుందాంరా సినిమాలోని ఒక చక్కని పాటతో ఫ్యామిలీ పాటల సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కలిసుందాంరా (2000)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : వేటూరి
గానం : రాజేష్
ధీంతన ధీంతన దిరనననా
దిరనదిరననానా
ధీంతన ధీంతన దిరనననా
దిరనదిరననానా
కలిసుంటే కలదు సుఖం
కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం
ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో
ఇంద్రధనుసు విరిసే
వస్తారా మా ఇంటికి
ప్రతిరోజూ సంక్రాంతికి
గుమ్మడి పువ్వుల నవ్వులతో
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో
ఇంద్రధనుసు విరిసే
ఖుషీ తోటలో
గులాబీలు పూయిస్తుంటే
హలో ఆమని చలో ప్రేమని
వసంతాలిలా ప్రతిరోజు
వస్తూ వుంటే
చలి కేకల చెలే కోకిల
నవ్వులనే పువ్వులతో
నిండిన ప్రేమవనం
వెన్నెలలే వెల్లువలై
పొంగిన సంతోషం
ప్రేమలన్నీ ఒకసారే
పెనేశాయి మా ఇంట
గుమ్మడి పువ్వుల నవ్వులతో
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో
ఇంద్రధనుసు విరిసే
కలిసుంటే కలదు సుఖం
కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం
ప్రేమకు పేరంటం
ఒకే ఈడుగా ఎదే జోడు
కడుతూవుంటే
అదే ముచ్చట కథేముందటా
తరం మారినా స్వరం మారనీ
ప్రేమ సరాగానికే వరం అయినది
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే
చాటులలో మాటులలో సాగిన అల్లరిలే
పాలపొంగు కోపాలు పైటచెంగు తాపాలు
గుమ్మడి పువ్వుల నవ్వులతో
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో
ఇంద్రధనుసు విరిసే
కలిసుంటే కలదు సుఖం
కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం
ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో
గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో
ఇంద్రధనుసు విరిసే
వస్తారా మా ఇంటికి
ప్రతిరోజూ సంక్రాంతికి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.