మంగళవారం, సెప్టెంబర్ 01, 2020

పిలిచినా రానంటావా...

అతడు సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం

పిలిచినా రానంటావా 
కలుసుకో లేనంటావా 
నలుగురూ వున్నారంటావా ఓ ఓ 
చిలిపిగా చెంతకు రాలేవా.. 
 
తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావ 
అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ 
తటపటా ఇస్తూ వుంటావా.. 
సమయం కాదంటావా సరదా లేదంటావా 
సరసం చేదంటావా బావా.. 
చనువే తగదంటావా 
మనవే విననంటావా 
వరసై ఇటు రమ్మంటే 
నామాట మన్నించవా 

డోలు భాజాల ఇలా నా వెంట పడతావా 
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
డోలు భాజాల ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా

కనులుంటే సొగసే కనపడదా 
మనసుంటే తగుమార్గం దొరకదా.. రాననకా 
అనుకుంటే సరిపోదే వనిత 
అటుపై ఏ పోరాబాటో జరగదా.. రమ్మనకా 
పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే 
తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే 
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి 
హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే 
హావ హవాయి అమ్మో అమ్మాయి 
విన్నాం కదా నీ సన్నాయి 
హావ హవాయి అమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా 
నలుగురూ వున్నారంటావా ఓ ఓ 
చిలిపిగా చెంతకు రాలేవా.. 

మొహమాటం పడతావ అతిగా 
సుకుమారం చిటికేస్తే చొరవగా.. చేరవుగా 
ఇరకాటం పెడతావే ఇదిగా ఆబలా 
నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా.. ఆగవుగా 
దరిశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా 
సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా 
వరాల బాలా వరించువేళ తరించనంటూ తగువేల 
నిగారమిట్ట జిగేలనాల జనం చెడేల.. ఎవ్రీబడీ 
నిగారమిట్ట జిగేలనాల జనం చెడేల జవరాల
నిగారమిట్ట జిగేలనాల జనం చెడేల జవరాల
తనాన నానే తనాన నానే తనాన నానే తననాన 
తనాన నానే తనాన నానే తనాన నానే తననాన
తనాన నానే తనాన నానే తనాన నానే తననాన  





0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.