శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

జాబిలమ్మవో...

బన్నీ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బన్నీ (2005)
సంగీతం : దేవీశ్రీప్రసాద్   
సాహిత్యం : చంద్రబోస్   
గానం : సాగర్, మాలతి

జాబిలమ్మవో జాజికొమ్మవో 
గాజు బొమ్మవో ఓ మైనా ఐలవ్‌యూ 
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో 
తేనే పట్టువో ఐడోంట్ నో వాట్‌ టుడూ 
ఇంటిముందు రంగవల్లివో 
ఓ చెలి పెరటిలోన తులసిమొక్కవో 
మందిరాన బంతి పాటవో 
ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో 
పరిచయం ఇష్టమై 
ఇష్టమే స్నేహమై 
ప్రాణమై నిలిచినావుగ 

జాబిలమ్మవో జాజికొమ్మవో 
గాజు బొమ్మవో ఓ మైన ఐలవ్‌యూ

ఓ నీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన
ఆ పదాలు నీకు రాసి చూపనా 
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే 
ఈ క్షణాలలోన అ యుగాలు దాటే
ఆ జగాలలోని ప్రేమ పంచనా 
బొట్టు మీద ఒట్టు పెట్టనా 
కాటుకల్లె కావలుండనా 
గుండె మీద ఒట్టు పెట్టనా 
అడుగు లోన గూడు కట్టనా 
జన్మకే బంధమై ప్రేమకే బానిసై 
పూజకే భక్తుడవ్వనా 

జాబిలమ్మవో జాజికొమ్మవో 
గాజు బొమ్మవో ఓ మైనా ఐలవ్‌యూ

హొ నీ మనస్సులోకి నా మనస్సు చేరి 
నీ మనస్సులోకి నా మనస్సు చేరి
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగ 
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి 
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా 
ముత్యమంత ముద్దుపెట్టనా 
మూడుముళ్ళ బంధమేయనా 
వెన్నెలంత ముద్దుపెట్టనా 
ఏడు జన్మలేకమవ్వనా 
రేయికే రాజునై పగటికే బంటునై 
రాణికే రాజ్యమవ్వనా

జాబిలమ్మవో జాజికొమ్మవో 
గాజు బొమ్మవో ఓ మైనా ఐలవ్‌యూ 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.