సోమవారం, సెప్టెంబర్ 21, 2020

జిలిబిలి జాబిలిలోనా...

మనసిచ్చి చూడు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మనసిచ్చి చూడు (1999)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : చంద్రబోస్  
గానం : హరిహరన్, చిత్ర 

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్నా 
హితులు స్నేహితులు ఎందరు వున్నా
యమున కోసమే చూస్తున్నా 
తెలుగు పదములెన్నెన్నో వున్నా
యమున పదమే తీపంటున్నా 
యమున... యమున... యమునా...

జిలిబిలి జాబిలిలోనా 
చెలి తళుకులు తిలకిస్తున్నా 

నా మదీ ..మహానది..వరదౌ...తున్నదీ 
ఈ ఇదీ ఇలాం..టిదీ ఎపుడూ లేనిదీ
తను అలా ఎదురౌ క్షణాన..
నిలువునా కదిలిపోనా 
నిలవనా మరీ మరో జగానా 

జిలిబిలి జాబిలిలోనా 
చెలి తళుకులు తిలకిస్తున్నా 

నా బలం ..ధనం..జనం 
యమునా స్నేహమే
నా స్థలం... నిరంతరం 
యమునా... తీరమే 
మనసే కోరి వలచే 
మమతే తనది కాదా 
మునగనా.. తనా
మనస్సులోనా

జిలిబిలి జాబిలిలోనా 
చెలి తళుకులు తిలకిస్తున్నా 
హితులు స్నేహితులు ఎందరు వున్నా
యమున కోసమే చూస్తున్నా
తెలుగు పదములెన్నెన్నో వున్నా
యమున పదమే తీపంటున్నా 
యమున... యమున... యమునా
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.