ఆదివారం, సెప్టెంబర్ 27, 2020

ఏ చిలిపి కళ్ళలోన...

ఘర్షణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఘర్షణ (2004)
సంగీతం : హారిస్ జయరాజ్ 
సాహిత్యం : కులశేఖర్ 
గానం : శ్రీనివాస్

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో 
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో

ఈ పరిమళము నీదేనా 
నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా 
తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా 
లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా 
కనులకు మాట రాదుగా అలా
వింతల్లొను కొత్త వింత నువ్వేన 
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో

ఆ పరుగులలో పరవళ్ళు 
తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది 
ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతోంది 
మోజు పడి నీకోసం
స్వరముల గీతి కోయిలా ఇలా 
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో 
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో 
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో 
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.