మంగళవారం, సెప్టెంబర్ 15, 2020

కలలోనైన కలగనలేదే...

నువ్వు వస్తావని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నువ్వువస్తావని (2002)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : బాలు

కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
ఓహొ....ఓహొ...హే...హే....
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని

చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా
కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా
జానకి నీడే రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాషలోన వేల పదములు తరుగుతున్నవి
నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది
ఓహొ...ఓహొ....

కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని

కాళిదాసు నేనై కవిత రాసుకోనా
కాలి గోటి అంచులపైన హృదయం ఉంచనా
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాధించనా
నాచెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
ఓహొ...ఓహొ...

కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
హే...హే.....హే...హే... 


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.