జర్నీ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జర్నీ (2011)
సంగీతం : సత్య
సాహిత్యం : సాహితి
గానం : కార్తీక్
మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి
వర్షమా వలపుల వర్షమా
కాచుకున్నా నీ మొదటిముద్దుకి
కన్ను మూయలా చెవి మోగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
చెయ్యి ఊపలా కాలు కదపలా
ఆ విసుగులో ఏ మెరుగలా
ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే
మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి
రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా
బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా
చూశాను అల్లంత దూరంలో
గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా
అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా
నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా
నిలిచాను ఆ పిల్ల గుండెలో
నిలిచిందో పిలిచిందో వీధిలో
నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురుచూశాలే ఈ పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా
కాచుకున్నా నీ మొదటి ముద్దుకీ
నంబరు అడగాలా ఫోను చెయ్యాలా
అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా
ఫాలో చెయ్యాలా కబురు పంపాలా
ఎలా వచ్చిందో ఎదురులో
టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా
మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా
ఎట్లా పడ్డాది ప్రేమలో
నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో
నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో
నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా
నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయలా చెవి మోగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
నాకు నీ ప్రేమే కావాలిలే..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.