రాజకుమారుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాజకుమారుడు (1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఆ..ఆ..ఆ..ఆ.
కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచానూ పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై
నీకోసం నేనున్నా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
అయినా తీపే తోడుంటే
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
చీకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే ఈనీటి లో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమ
నీ ప్రేమకై ఈ జన్మ
నీవే నేనై పొతుంటే
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.