బుధవారం, సెప్టెంబర్ 16, 2020

ప్రేమించే ప్రేమవా...

నువ్వు నేను ప్రేమ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నువ్వు నేను ప్రేమ (2006)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి  
గానం : నరేష్ అయ్యర్, శ్రేయఘోషల్

ప్రేమించే ప్రేమవా 
ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా 
పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే నా ప్రేమవా 
ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా 
పూవల్లె పుష్పించే

రంగు రంగోలి
గొరింటే నువ్వు పెట్టే 
రంగే పెట్టిన రేఖలు మెరిసి 
గాజుల సవ్వడి ఘల్ ఘల్

రంగు రంగోలి 
గొరింటే నువ్వు పెట్టే 
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నులు చందనమద్దిన 
చల్లని పున్నమి వెన్నెల విందులు

పూవైనే పూస్తున్నా 
నీ పరువంగానే పుడతా
మధు మాసపు మాలల 
మంటలు రగిలించే ఉసురై

నీవే నా మదిలో అడ 
నేనే నే నటనై రాగా
నా నాడుల నీ రక్తం 
నడకల్లో నీ శబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు 
విలవిలలాడే ఒంటరి మీనం 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా
నే నేనా అడిగా నన్ను నేనే
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

నెల నెల వాడుక అడిగి 
నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే 
నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించా తరమా
నీవు సంద్రము చేరె
గల గల పారే నది తెలుసా

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లె..

రంగు రంగోలి
గొరింటే నువ్వు పెట్టే 
రంగే పెట్టిన రేఖలు మెరిసి 
గాజుల సవ్వడి ఘల్ ఘల్

రంగు రంగోలి 
గొరింటే నువ్వు పెట్టే 
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నులు చందనమద్దిన 
చల్లని పున్నమి వెన్నెల విందులు

రంగు రంగోలి
గొరింటే నువ్వు పెట్టే 
రంగే పెట్టిన రేఖలు మెరిసి 
గాజుల సవ్వడి ఘల్ ఘల్

రంగు రంగోలి 
గొరింటే నువ్వు పెట్టే 
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నులు చందనమద్దిన 
చల్లని పున్నమి వెన్నెల విందులు



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.