గురువారం, సెప్టెంబర్ 17, 2020

గున్నమావి కొమ్మ మీద...

నువ్వు నేను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నువ్వు నేను (2001)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్  
గానం : మల్లిఖార్జున్, ఉష 

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది
రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది
కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా
చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా
కటిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది
కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది
పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా
హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా
బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట
నువ్వు నేనంటా
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.