శనివారం, సెప్టెంబర్ 26, 2020

దొరకునా ఇటువంటి సేవ...

పాట నాకు ప్రాణమై నా జీవితంలో ప్రముఖ భాగమవడానికి కారణమైన మహానుభావుడు నిన్న (సెప్టెంబర్ 25-2020) నిష్క్రమించారు. బహుశా ఇలలో చేసిన స్వరార్చన చాలని నేరుగా తన అమృత గాత్రంతో భగవంతుడిని అర్చించుకోడానికే వెళ్ళారేమో. ఈ జగతిలో పాట ఉన్నంతకాలం మీరూ ఉంటారు బాలు గారూ. 

శంకరాభరణం చిత్రంకోసం వేటూరి గారు వ్రాసిన ఈ పాట బాలుగారికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి.మహదేవన్   
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు, వాణీజయరాం

దొరకునా.. దొరకునా.. 
దొరకునా.. ఆఆ.ఆఅ...
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ 
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 

రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా
దేవాదిదేవా.. ఆ.. 

దొరకునా ఇటువంటి సేవ 
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందువేళ మహానుభావా
మహానుభావా... 

దొరకునా... సేవ...
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 
దొరకునా ఇటువంటి సేవ 
 

3 comments:

జెమినీలో శంకరాభరణం వేశాడుసోదరా
ఈ పాట రోమాంచ కలిగించింది
కళ్ళు చెమర్చాయి.
చిన్నప్పుడు బహుశా మనం రెండోక్లాసులో ఉన్నప్పుడు వచ్చిందీ సినిమా
చూసిన ప్రతిసారీ ఓ కొత్త అనుభవం

ఈ పాటలో “నిర్వాణ” బదులు ‘నిర్యాణ’ అంటే బాలు గారి పరలోక ప్రయాణానికి సరిపోయే మాట అవుతుందేమో కదా?

మహానుభావుడు, సార్థక జన్మ 🙏

అవును సోదరా ఈ పోస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా నా పరిస్థితి అదే. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

సార్థక జన్మ సరైన మాట విన్నకోట వారూ. నిర్వాణమన్నా కూడా బాలూకి సరిపోతుందండీ. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.