ఈ రోజు గురుపూజోత్సవం సందర్భంగా గురు శిష్యులకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఎగిరే పావురమా చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు
బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు
వేదమూర్తులై నాద యోగ సాధకులై
పరమొకటే కోరుకున్న ఆ స్వర ధనులెవరో
తెలసి తలచి నా ఉపాధికై రాగ భావ జాలనలో
గతివిడిచీ పాడుకున్న నా అభినవ జతినే
వలచి మలచి తీసానులే కొత్త రాగమే హా హా
అ అ అ అ వేశానులే... ఆది తాళమే...
పదమునాకు మనుగడకాగా
లయలు జతులు క్రియలు ప్రియముకాగా
జగతినెరిగి సుగమగతులనడిగె...
బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు
త్యాగబ్రహ్మమూ తాళ్ళపాక అన్నమయా
జపియించే భక్తి భావనా సురభిళకృతులే
తలచి తరచీ నూతనత్వమే
కోరుకున్న అభిరుచులే
గమనించీ నవ్యరీతిలో
గమకపు లయతో కలిసి మెలిసి
సాగేనులే బాటసారిగా ఆ...ఆఆఆ..
సంగీతమే జీవనాడిగా...
తెలుగు పాట జగతికి చాట
చిలిపి వలపు కలిపి పదము పాడ
మనసు నిలిపి మధుర జతుల తేలె.
బ్రహ్మలూ గురు బ్రహ్మలూ
గానామృత రసవిదులూ కోవిదులు
శృతి లయ సంగమ సుఖజతిలో
స్వరపద యోగజ సమగతిలో
ముఖరిత మానస మునివరులూ
భువిలో వెలసిన సురవరులు
సనిపమా నిపమనీ రిగరిస
సనిపని సనిపమ పనిపమ రిగరిస
నిసరిగరి నిసరిపమ సరిమపని సరిమపప
రిప పనిప మప నిసరిస రిసనిపనిస సనిపదనిప
మపరిగరిస నిసరిమ నిసరిమప రిమపని
రిమపనిస మపనిస మపనిసరిస
ఆ... ఆ... ఆఆ....
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.