బుధవారం, సెప్టెంబర్ 09, 2020

అంతే ఈ ప్రేమ వరస...

మనసిచ్చి చూడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మనసిచ్చి చూడు (1999)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : బాలు, సుజాత

నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి..
అంతే ఈ ప్రేమ వరసా 
దాని అంతే చూడాలి వయసా
ఈవేళ ఈ సూర్యోదయం 
ఇన్నాళ్ల లాగ లేదు కదా
నీలోన ఈ ప్రేమోత్సవం 
ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా
 
నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా

భాష మొత్తమూ మాయమైనదా 
గుండె మాట గొంతు దాటి రాదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
శ్వాస మాత్రమూ గేయమైనదా 
హాయి పాటలెన్నో మీటుతోందే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
నీలో ఏదో కొత్త కోణం చూశా 
నువ్వు నువ్వేనా కాళిదాసా
నీవే కదా నిండు ప్రాణం పోసి 
దీన్ని పెంచావు కన్నె హంస
ఒక్క మాటే అని కోటి భావాలని 
అందచెయ్యాలని కొత్త పాఠం ఇదే తెలుసా

నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా

కన్ను కొద్దిగా చిన్నదైనదా 
నిన్ను తప్ప ఏమీ చూడలేదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక 
కాలమంతా ఆగిపోయే ముందే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
ఏతా వాతా దీని వాటం చూస్తే 
తీయగా ఉన్న కత్తి కోత
ఇంటా బయటా మొగమాటం పెట్టే 
తప్పుకోలేని వింత వేటా
మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా
పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా

నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి..
అంతే ఈ ప్రేమ వరసా 
దాని అంతే చూడాలి వయసా
ఈవేళ ఈ సూర్యోదయం 
ఇన్నాళ్ల లాగ లేదు కాదా
నీలోన ఈ ప్రేమోత్సవం 
ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా
 
నాలో ఏదేదో అయిపోతున్నది
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా 
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా 


 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.