ఆదివారం, సెప్టెంబర్ 13, 2020

మైకం కాదిది...

యువకుడు చిత్రంలో ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : యువకుడు (2000)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : ఎస్.పి.చరణ్

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా..హా

తేలుతున్నాను..హే.హే 
నీలి మేఘాలలో..హే.హే
మునుగుతున్నాను 
తొలిప్రేమ భావంలో
మేలుకున్నానో 
కలలోన ఉన్నానో

పాటలా ఉంది..హే.హే 
గాలి ఈలేసినా..హే.హే
ఆటలా ఉంది 
ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది 
ఎటు వైపు చూస్తున్నా

మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవ్వాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా..హా 
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.