ఆవారా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఆవారా (2010)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : సాగర్ దేశాయ్
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే...హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన
ఈ ఎండకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన
మది అలలాగ చేరు ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే...హే
చిరుగాలి తరగంటి నీమాటకే
ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే
తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్ళలో
దొంగచూపేదో పురివిప్పెనే
కొంచెం నటనున్నది
కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్ వల వేస్తే నువ్ వల వేస్తే
నా ఎద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
ఒకసారి మౌనంగా నను చూడవే
ఈ నిమిషమే యుగమౌనులే
నీ కళ్ళలో నన్ను బందించవే
ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో
కరిగే ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్రమందారం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే...హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.