బుధవారం, ఆగస్టు 12, 2020

హాపీ హాపీ ఫ్యామిలీ...

తేజ్ ఐ లవ్యూ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తేజ్ ఐలవ్యూ (2018)
సంగీతం : గోపీసుందర్  
సాహిత్యం : గోసల రాంబాబు 
గానం : సింహ 

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే
ఎన్నో ఎన్నో ఎన్నో ఉల్లాసాలే ఎన్నో
ఊపేస్తుంటే అందే అంబరమే 
మనసంతా తుళ్ళేనూ ప్రతిక్షణమూ హాయిగా 
ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా 
గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా 
ఈ ఆటల పాటల ఆనందాలా

హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే

అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ
ఒకచోటే కలిసి మెలిసి సందడినే చేసేనా
చిలిపితనం చెలిమిగుణం చిరు జగడాలన్నీ
కనులెదుటే గంతులు వేసి గిలిగింతలు పెట్టేనా
సరదా దసరా రోజూ జరిగే బృందావనమిదిలే
దరికే రాదూ ఏ దిగులూ ఔనా 
అలుపు సొలుపు ఎపుడూ 
ఎరుగని అల్లరి చిందులివే 
అలకే లేదంటా ఎవ్వరిలోనా 

హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే

అతిథులుగా దేవతలే దిగివస్తారేమో
ఇలపైనే స్వర్గంలాంటి ఈ ఇల్లే చూశాక 
శతమానం భవతంటూ దీవిస్తారేమో
ఈ అనుబంధాలే సాక్ష్యం తడికంటికి శలవిక
అమ్మా నాన్నను మరిపిస్తారే ఈ ఐనోళ్ళంతా
ఇంతకు మించిన వరముండదు అంటా
జన్మకు సరిపడు ప్రేమను పంచేవాళ్ళే చుట్టూతా
ప్రాణం ఇంకేమీ కోరదు అంటా 

1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ



2 comments:

బావుందండీ పాట..యెప్పుడూ వినలేదు..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.