సోమవారం, ఆగస్టు 17, 2020

డాడీ కథ వినవా...

ఉగాది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఉగాది (1997)
సంగీతం : ఎస్వీ. కృష్ణారెడ్డి
సాహిత్యం : భువనచంద్ర 
గానం : ఉన్నికృష్ణన్, సునీత, మనో, శ్రీలేఖ  

డాడీ కథ వినవా చెబుతాను
బేబీ చెప్పేయవా వింటాను
నిన్న మొన్న నాకే తెలియక
సతమతమయ్యా డాడీ
అరె సిగ్గేసినా చెప్పేయనా ఆ మాటని

మమ్మీ నా ప్రేమ సొద వినవా
బాబు విననంటే వింటావా

తొలి తొలి చూపే తొలకరి వానై
స్పృశించింది డాడీ
అదో వింత హాయి మమ్మీ
నిన్నటిదాకా తెలియని ఊహలు
తలెత్తాయి డాడీ
నను మథించాయి మమ్మీ
పెదవులు దాటని పిలుపులు వింటూ
తరించాను డాడీ
నే తపించాను మమ్మీ
నిద్దుర పట్టదు ఆకలి పుట్టదు
ఒకటే గుబులే మమ్మీ
కలయో తెలియని నిజమో తెలియని
కలవరపాటే మమ్మీ
సాల్ట్ తీసుకుని టేస్ట్ చేసినా
స్వీటుగుందిలే డాడీ
ఆ తలపే ప్రేమ పిలుపే ప్రేమ గుబులే ప్రేమ

బాబూ వివరాలే చెప్పమ్మా
బేబీ బిడియాలే వద్దమ్మా

ముద్దుల పాపని మురిపెంగా 
తను పెంచినాడు మమ్మీ
ప్రాణం పంచినావు డాడీ
కోరినవన్నీ కాదనకిచ్చే 
దేవుడు తను మమ్మీ
ఐ లవ్యూ మై డాడీ
పిల్లల ఆశని వమ్ము చేయని 
పెద్ద మనసు తనది 
ఎంతో మంచి మనసు తనది
గురువు దైవం నేస్తం సర్వం
అతడే నాకు డాడీ
అంతటి మనిషికి అల్లుడినవటం 
లక్కీ లక్కీ లక్కీ
నువ్వు మెచ్చిన నీకు నచ్చిన 
యువకుడె అల్లుడు బేబీ
నీ మదిలో ఉన్న వాడే 
మాకు నచ్చేనమ్మా

బాబు సుముహూర్తం చూసేయనా
బేబీ లగ్నాలే పెట్టేయనా
పెళ్ళికొడుకునే చూడకుండ
ఈ అల్లరి ఏమిటి డాడీ
అరె నీ కళ్ళతో చూసాములే అబ్బాయిని
మమ్మీ అత్తవి ఐపోతావా
బేబీ మనవడినే ఇస్తావా 
 
 

2 comments:

ఈ పాట కళ్ళు మూసుకుని వింటే చాలా బావుంటుందండీ..

హహహహ కరెక్ట్ గా చెప్పారండీ :-) థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.