శుక్రవారం, ఆగస్టు 21, 2020

మా లోగిలిలో పండేదంతా...

మా అన్నయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : మా అన్నయ్య (2000)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : శ్రీహర్ష
గానం : బాలు, ఉన్నిమీనన్, 
చిత్ర, సుజాత 

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం 
ఈ రూపం ప్రేమకు ప్రతి రూపం

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

రాముడు అడవికి వెళ్ళేనా 
నువ్వే అన్నై ఉండుంటే
ఏసు శిలువ మోసేనా 
నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా 
జన్మంతా జరిగేనులే
అన్నంటూ లేకుంటే 
క్షణమైనా యుగమౌనులే
కనకున్ననూ కన్నమ్మవై 
కడుపున మము దాచీ 
కాచిన దైవమా

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కటి బంధాన్ని 
కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ 
రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో 
తమ్ముళ్ళం అయ్యాములే
తన బతుకే మా మెతుకై 
తనయులమే అయ్యాములే
మా దేవుడు మాకుండగా 
మరి మాకిక లోటేది 
కలతకు చోటేది

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికీ మా కంటికీ మణి దీపం 
ఈ రూపం ప్రేమకు ప్రతి రూపం

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే 
 

2 comments:

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.